పాక్‌ వైమానిక దాడిని తిప్పికొట్టిన భారత్‌

చెరో యుద్ధ విమానం కూల్చివేత
పాక్‌ చేతిలో భారత పైలట్‌ బందీ
మా శక్తి చాటేందుకే దాడి: ఇమ్రాన్‌
చర్చలకు సిద్ధమని ప్రకటన
టెర్రరిజం మూలస్థానాలను రూపుమాపుదాం: చైనా, రష్యా, భారత్‌
పాక్‌ ‘అర్థవంతమైన చర్య’ తీసుకోవాలి: అమెరికా
సైన్యానికి ప్రతిపక్షాల బాసట

న్యూఢిల్లీ: భారత్‌ మధ్య కశ్మీర్‌ వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ మేఘాలు అలు ముకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉద్రి క్త వాతావరణం నెలకొంది. పుల్వామా వద్ద టెర్ర రిస్టు దాడి దరిమిలా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషె మహమ్మద్‌ తదితర ఉగ్రవాద సంస్థల శిబి రాలు, శిక్షణా కేంద్రాలపై భారత వైమానిక దళం సర్జికల్‌ దాడికి ప్రతీకారమన్నట్లు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు బుధవారం ఉదయం భారత భూ భాగంలోకి దూసుకురాగా భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో భార త్‌, పాకిస్థాన్‌లు చెరో యుద్ధ విమానం కోల్పో యాయి. భారత్‌ రెండు విమానాలు కోల్పోయినట్లు పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. కాగా ‘అభినందన్‌’ అనే భారత్‌ పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాకి స్థాన్‌ ఒక వీడియో విడుదల చేసింది.భారత్‌ సైనిక స్థావరాలపై దాడి లక్ష్యంగా పాకిస్థాన్‌ విమానాలు వచ్చినట్లుగా భారత్‌ ఆరోపించగా, అది తమ లక్ష్యం కాదని, మీలాగే మేము కూడా మీ దేశంలోకి చొచ్చుకు రాగలమని చెప్పటమే దాడి ఉద్దేశమని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. యుద్ధం వాంఛనీయం కాదంటూ, చర్చలకు సిద్ధ మని భారత్‌కు ప్రతిపాదించారు. ఇదిలా వుండగా, చైనాలో జరిగిన రష్యా, భారత్‌, చైనా (రిక్‌) విదే శాంగ మంత్రుల సమావేశం టెర్రరిజం, తీవ్రవాదం మూలాలను రూపుమాపాలని, విధాన సమన్వ యం, ఆచరణాత్మక సహకారం ద్వారా అన్ని రకాల టెర్రరిజంపై పోరాడాలని నిర్ణయిం చారు. పాకిస్థాన్‌ విషయంలో చైనా వైఖరికి సంబంధించి భారత్‌లో కొన్ని అనుమానాలున్నప్పటికీ, భారత్‌ రెండింటికీ “పరస్పర మిశ్రదేశం”గా వారు చర్చలు జరుపుకోవాలని, శాంతిని సాధించా లని, ఈ క్రమంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషి స్తుందని” చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చెప్పారు.
తమ భూభాగం నుంచి పనిచేస్తున్న టెర్రరిస్టు గ్రూ పులకు వ్యతిరేకంగా “అర్థవంతమైన చర్యలు” తీసుకోవాల్సిందిగా అమెరికా బుధవారం పాకిస్థా న్‌ను గట్టిగా కోరింది. ఉద్రిక్తతల సడలింపు ఆవ శ్యకతను నొక్కి చెప్పింది. అమెరికా విదేశాంగ మం త్రి మైక్‌ పాంపియో భారత్‌, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రులతో ఫోన్‌ద్వారా సంభాషించారు. “సంయ మనం పాటించాలని, ఉద్రిక్తతల విస్తరణను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని నేను ఆ ఇరువురికీ చెప్పాను. ప్రత్యక్ష కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, మరికొన్ని సైనిక చర్యలను విడనాడాలని చెప్పా ను” అని పాంపియో చెప్పారు. ఇదిలావుండగా, ఢిల్లీలో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల సమావేశం పాకిస్థాన్‌ దాడి యత్నాన్ని ముక్త కంఠంతో ఖండించింది. భారత సైన్యానికి బాసట గా ఉంటామని ప్రకటించింది. అయితే దేశభద్రత సమస్యను రాజకీయ స్వప్రయోజనానికై ఉపయో గించుకుంటున్న బిజెపి వైఖరిని ఖండించింది.

DO YOU LIKE THIS ARTICLE?