పాకిస్థాన్‌ అబద్ధం బట్టబయలు కూలింది ఎఫ్‌ 16

భారత్‌ పైలట్‌ కూల్చింది ఎఫ్‌ 16నే..
ఆమ్రామ్‌, మిస్సిలీ శకలాలే సాక్ష్యం
మన రక్షణ స్థావరాలు సురక్షితం
సర్జికల్‌ స్ట్రుక్స్‌ లక్ష్యం సాధించాయి
పత్రికాగోష్టిలో త్రివిధ దళాధిపతులు
కొనసాగుతున్న పాక్‌ కాల్పులు
చర్చలకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పునఃప్రతిపాదన

న్యూఢిల్లీ: భారత్‌పై గురువారం ఎఫ్‌16 విమానాలను ఉపయోగించలేదన్న పాకిస్థాన్‌ ప్రచారం బూటకమని తేలిపోయింది. భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మిగ్‌21 ద్వారా కూల్చివేసి విమానం ఎఫ్‌16 శ్రేణివేనని భారత వైమానికదళ ఉప అధిపతి ఆర్‌జికె కపూర్‌ శుక్రవారం ఢిల్లీలో పత్రికాగోష్టిలో వెల్లడించారు. భారత మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్థాన్‌ ఎఫ్‌ 16 విమానాలను ఉపయోగించిందనటానికి సాక్ష్యంగా ఆమ్రామ్‌ మిస్సిలీల శకలాలను చూపా రు. ఈ మిస్సిలీలను ఎఫ్‌16 విమానాల ద్వారా మాత్రమే ఉపయోగిస్తారు. పాకిస్థాన్‌ బాంబు దాడులు మనదేశ రక్షణ వసతులకు ఎటువంటి నష్టం చేయలేదన్నారు. పాకిస్థాన్‌ పట్టుకున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ స్వదేశానికి తిరిగి రానుండడంపై భారతీయ వాయుసేన గురువారం సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే అది సౌహార్దతకు సంకేతం అన్న వాదనను కొట్టిపారేసింది. జెనీవా ఒప్పందం నియమాల మేరకే అతడిని వదిలిపెడుతున్నారని స్పష్టం చేసింది. ‘అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనుండడంపై మేము చాలా సంతోషంగా ఉన్నాం. అతడి ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఆర్‌జికె కపూర్‌, ఆసిస్టెటెంట్‌ చీఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ పత్రికాగోష్టిలో చెప్పారు. ‘శాంతి సంకేతం’ సూచనగా వర్థమాన్‌ను శుక్రవారం విడుదలచేస్తున్నామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం పాకిస్థాన్‌ పార్లమెంటులో ప్రకటించారు.

DO YOU LIKE THIS ARTICLE?