పసిడితో మెరిసిన పూనమ్‌

విశాఖపట్నం: కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌, భారత స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌ తన ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని వేసుకుంది. ఇ క్కడ జరుగుతున్న జాతీయ సీనియర్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పూ నమ్‌ యాదవ్‌ మహిళల 81 కేజీల విభాగంలో పసిడిని కైవసం చేసుకుం ది. సోమవారం నాలుగో రోజు రైల్వేస్‌ తరఫున బరిలో దిగిన పూనమ్‌ యా దవ్‌ మొత్తం 220 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంతో బంగారు పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 99 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 121 కిలోల బరువును పూనమ్‌ ఎత్తింది. ఇక ఢిల్లీకి చెందిన సీమ 218 కిలోలు ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సీమ (స్నాచ్‌లో 97 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 121 కిలోలు) ఓవరాల్‌గా 218 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఇక పం జాబ్‌కు చెందిన మం జీత్‌ కౌర్‌ (స్నాచ్‌లో 96 కిలోలు, క్లీన్‌ అం డ్‌ జెర్క్‌లో 119 కి లోలు) ఎత్తి ఓవరాల్‌గా 215 కిలోలతో కాంస్య పతకాన్ని ద క్కించుకుంది. ఇక పు రుషుల 73కేజీల వి భాగంలో అచింత షేయ్‌లీ (వెస్ట్‌ బెంగాల్‌) (స్నాచ్‌లో 135 కిలోలు, క్లీన్‌ అం డ్‌ జెర్క్‌లో 165 కిలోలు) ఎత్తి స్వర్ణ పతకా న్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 81 కేజీల విభాగంలో అస్సాం వెయిట్‌ లిఫ్టర్‌ పపుల్‌ చాంగ్‌మై (స్నాచ్‌లో 140 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 180 కిలోలు) ఎత్తి మొదటి స్థానంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?