పరిషత్‌ పోరు.. తొలి విడత ప్రచారానికి తెర

హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి విడత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ నెల 6న ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని ఎన్నికల సంఘం సూచించింది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్‌ను సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేశారు. తొలి విడతలో భాగంగా మొత్తం 2166 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇందు లో 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 197 జెడ్‌పిటిసి స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ కాగా అందులో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలో ఒక్కో జెడ్‌పిటిసి స్థానం ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 195 జెడ్‌పిటిసి, అలాగే 2097 ఎంపిటిసి స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?