పట్టుబడిన చెడ్డీగ్యాంగ్‌

గుజరాత్‌లో అరెస్టు : హైదరాబాద్‌ తరలింపు

ప్రజాపక్షం/ సిటీబ్యూరో : వరుస దొంగతనాలతో నగరంలో అలజడి సృష్టించిన గుజరాత్‌కు చెందిన చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను సైబరాబాద్‌ పోలీసులు రెండు రోజుల క్రితం గుజరాత్‌లో అరెస్ట్‌ చేశారు. సోమవారం ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకు వచ్చారు. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ గ్యాంగ్‌లో ఇద్దరు పట్టుబడగా ముగ్గురు పరారీలో ఉన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ సజ్జనార్‌ వివరాలను వెల్లడించారు. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన మహిసాగర్‌ జిల్లా సమీపంలోని మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక తెగవారు దొంగతనాలే జివనాధారంగా ఎంచుకున్నారు. వారు రైలు మార్గంలో సామాన్య ప్రజల్లా ప్రయాణం చేసి ప్రధాన నగరాల శివారు స్టేషన్‌లలో దిగుతారు. అక్కడ తమ వేషధారణ మార్చుకుని చెడ్డీలు, బనియన్‌లు ధరించి అర్ధరాత్రి వేళ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడతారు. తిరిగి వేషధారణ మార్చుకుని అందుబాటులో ఉన్న రైలెక్కి తమ ప్రాంతానికి వెళ్లిపోతారు. ఇదే తరహాలో నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో డిసెంబర్‌ 2017, ఎప్రిల్‌ 2018, జనవరి 2019లో దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన దొంగతనాలలో నేరస్తుల జాడ తెలియక పోగా 2019 జనవరిలో కూడా దొంగతనాలు జరగడంతో పోలీసులు కేసును వేగవంతం చేశారు. దొంగల ముఠా గుజరాత్‌ రాష్ట్రంలో ఉందని విశ్వసనీయంగా తెలియడంతో అక్కడికి చేరుకుని మారు వేషాలలో 15 రోజులు సంచరించి హసన్‌ నార్సింగ్‌, రాజుసావ్‌ సింగ్‌ అనేఇద్దరు సభ్యులను పట్టుకోగలిగారు. ఈ నెల19న వారిని అరెస్ట్‌ చేసి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సోమవారం నగరానికి తీసుకువచ్చారు. వారిని విచారించగా వినోద్‌, పంకజ్‌, జేసమ్‌ అనే మరో ముగ్గురు సభ్యులు కూడా వారి ముఠాలో ఉన్నారని గుర్తించారు.పట్టుబడిన వారివద్ద నుండి కేవలం వెయ్యిరూపాయలను మాత్రమే పోలీసు లు రికవరి చేయగలిగారు.మిగిలిన ముఠా సభ్యులను పట్టుకోవాలన్నా,చోరి సొత్తు రికవరీ చేయాలన్నా నిందితులు నివసించే మారుమూల ప్రాం తానికి వెళ్లాల్సిందే.వీలైనంత త్వరలో మిగిలిన గ్యాంగ్‌ సభ్యులను కూడా అరెస్ట్‌ చేసి సొత్తు రి

DO YOU LIKE THIS ARTICLE?