పట్టని పేదలు, వలసలు!

ఆర్థిక ప్యాకేజీ తొలి విడత వ్యాపార, వాణిజ్య వర్గాలకే
ఎంఎస్‌ఎంఇలకు రూ.3లక్షల కోట్ల రుణాలు
మూడు నెలల పిఎఫ్‌ కేంద్రమే చెల్లిస్తుంది
ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్‌
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజా గా ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా తొలి విడత ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన నిరుపేదల బతుకులను చక్కదిద్దేందుకు గానీ, వలస కార్మికులను ఆదుకునేందుకు గానీ ఈ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఈ తొలి విడత ప్యాకేజీ పూర్తిగా వ్యాపార, వాణిజ్య వర్గాల అభ్యున్నతికి సంబంధించినదిగా వుంది. ఎంఎస్‌ఎంఈలకు భారీగా రుణాలు, మూడు నెలల పిఎఫ్‌ ప్రభుత్వమే భరించడం వంటి అంశాలు తప్ప సామాన్యునికి అనుగుణమైన అంశాలేవీ నిర్మల ప్రకటించిన ప్యాకేజీలో లేవు. అవి కూడా ఆర్థిక సాయాలంటూ ఏమీ లేవు. అన్నీ రుణ ప్రతిపాదనలే. నిర్మలా సీతారామన్‌ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ఆర్థి క, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనా భా, డిమాండ్‌ అనే ఐదు మూల సూత్రాలుగా ఈ ప్యాకేజీ ఉంటుందని, స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యమని చెప్పారు. గత 40 రోజుల్లో మన శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసిందని, పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామని, నవ భారత్‌ నిర్మాణమే ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూల సూత్రమని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు తెలిపారు. వెల్లడించారు. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరుచేస్తామని, ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ప్రతి రోజూ ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని తెలిపారు. రూ.5లక్షలలోపు ఆదా య పన్ను రీఫండ్‌ బకాయిలు వెనక్కి చెల్లించామని చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10వేల

DO YOU LIKE THIS ARTICLE?