పంత్‌ విధ్వంసం..

ముంబయి: ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ సంచలనం రిషభ్‌ పంత్‌ (78 నాటౌట్‌; 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 213/6 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం పంత్‌ బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా తన మార్క్‌ షాట్లతో అలరించాడు. మరోవైపు శిఖర్‌ ధావన్‌ (43; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కొలిన్‌ ఇంగ్రామ్‌ (47; 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఐపిఎల్‌ సిజన్‌ 200 పరుగుల మార్కును పూర్తి చేసిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది.

DO YOU LIKE THIS ARTICLE?