న్యాయమూర్తుల బదిలీ ఉత్తర్వులు

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తుంది. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ,ఎపి రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు.. న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులకు సంబంధించి బదిలీల ప్రక్రియను పూర్తి చేసింది. దాదాపు వంద మందికిపైగా జడ్జిలు, అడిషనల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జడ్జిల స్వస్థలాలను ప్రామాణికంగా తీసుకొని న్యాయమూర్తులు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రానికి వారిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.

DO YOU LIKE THIS ARTICLE?