నేను ప్రజల ఏజెంట్‌

ఎన్నికల ప్రచార సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌
కోదాడ: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం తెలంగాణకు వచ్చి ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవార కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంటు, నీటి సమస్య ఉందని విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రధాని వంటి వారు కూడా ఇలాంటి అబద్ధాలు ఆడటం మన దురదృష్టకరమని, ఇదిలా ఉంటే కెసిఆర్‌ యూపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఏజెంట్‌ అని మోడి అంటారని, రాహుల్‌ గాంధీయేమో కెసిఆర్‌ మోడికి ఏజెంట్‌ అంటున్నారని చెప్పారు. కెసిఆర్‌ ప్రజలకే ఏజెంట్‌నని ఆయన స్పష్టం చేశారు. నేడు దేశంలో అత్యధికంగా విద్యుత్‌ వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ . భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు అంతంత మాత్రమే’నని ఆయన అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?