నేడు రాష్ట్ర క్యాబినెట్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతుంది. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?