నేడు మంత్రివర్గ ప్రత్యేక భేటీ

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం శనివారం  మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై  ఈ మంత్రివర్గ  సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌ డౌన్‌ను పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన, రాష్టంలోని పేదలు  ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం,  వ్యవసాయ కొనుగోళ్లు- వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?