నేడు పైలట్‌ అభినందన్‌ విడుదల

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ‘సుహృద్భావ’ ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్‌తో శాంతిచర్చలకు మార్గం సుగమం అయ్యేందుకు వీలుగా, తొలి చర్యగా తమ నిర్బంధంలో ఉన్న భారత వాయుసేన పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను శుక్రవారం విడుదలచేయనున్నట్లు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం చెప్పారు. భారత్‌- మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు వీలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఇమ్రాన్‌ఖాన్‌ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి అన్న గంటలో పే ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ప్రకటన చేశారు. పాకిస్థా న్‌ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు షహబాజ్‌ షరీఫ్‌ ఆగ్రహంతో చెలరేగి మాట్లాడుతున్నప్పుడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జోక్యం చేసుకున్నారు. ‘జోక్యం చేసుకుంటున్నందుకు క్షమించాలి. శాంతికి మార్గం సుగమం అయ్యేందుకు వీలుగా పాకిస్థాన్‌ వాయుసే బు ధవారం పట్టుకున్న భారతీయ పైలట్‌ను విడుదల చేయనున్నాం’ అన్నారు. ‘శాంతిని కోరుకుంటున్న మనం శుక్రవారం సంప్రదింపులకు మార్గం సుగమం అయ్యేందుకు తొలిచర్యగా మన నిర్బంధంలో ఉన్న పైలట్‌ను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే పాకిస్థాన్‌లోని పార్లమెంటు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఉద్రిక్తతలను సడలించాలని పాకిస్థాన్‌ కోరుకోవడాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదని, అది పాకిస్థాన్‌ బలహీనతగా అపోహపడకూడదు’ అని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. ‘మా సాయుధ ద ళాలు యుద్ధానికి మెరుగైన తరీదు పొందా యి. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని కూడా తెలిపారు. తాను భారత ప్రధానితో ఫోనులో మాట్లాడటానికి బుధవారం ప్రయత్నించానని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. కాగా భారత వాయుసేనకు చెందిన పైలట్‌ తమ వద్ద సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాడని పాకిస్థాన్‌ విదేశాం కార్యాలయం తెలిపింది. ప్రజల దాడి నుంచి కాపాడినట్లు కూడా తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?