నేటి నుంచి కెసిఆర్‌ ప్రచారం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. సాయం త్రం 4 గంటలకు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో నుంచి కెసిఆర్‌ తన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని ఎల్‌.బి. నగర్‌లో జరిగే చేవేళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారన్ని ఏప్రిల్‌ 4వ తేదీ వరకు దాదాపు ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇదివరకే కరీంనగర్‌, నిజామాబాద్‌ లోక్‌సభలో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన విషయం తెలిసిందే.
షెడ్యూల్‌ : ఈనెల 31న సాయంత్రం 4గంటలకు వనపర్తిలో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం, సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్‌నగర్‌లో మహబూబ్‌నగర్‌ నియోజకర్గ సభ. ఏప్రిల్‌ 1న సాయంత్రం 4 గంటలకు రామగుండంలో పెద్దపల్లి నియోజకవర్గ సభ. ఏప్రిల్‌ 2న సాయం త్రం 4గంటలకు వరంగల్‌లో వరంగల్‌ లోక్‌సభ, భువనగిరిలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం. ఏప్రిల్‌ 3న సాయంత్రం 4 గంటలకు ఆందోల్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ, 5.30 గంటలకు నర్సాపూర్‌లో మెదక్‌ లోక్‌సభ. ఏప్రిల్‌ 4న సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్‌లో మహబూబాబాద్‌ లోక్‌సభ,5.30గంటలకు ఖమ్మంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సభ.

DO YOU LIKE THIS ARTICLE?