నిలిపివేస్తారా… స్టే ఇవ్వాలా?

సాగు చట్టాల అమలుపై మోడీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్‌
అన్నదాతకు అండగా నిలిచిన అత్యున్నత న్యాయస్థానం
రైతుల ఆందోళన విషయంలో ప్రభుత్వ తీరుపట్ల అసహనం
సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన
కమిటీలో మాజీ ప్రధాన న్యాయమూర్తులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మూడు రైతు చట్టాలను కొంతకాలం అమలుకాకుండా నిలిపివేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి (సిజె) నేతృత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిం ది. ఈ చట్టాలను అమలు చేయవద్దంటూ రైతులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీ శివార్లు, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో రైతు చట్టాలపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతుండగా, ప్రభుత్వం ససేమిరా అంటున్నది. ఏవైనా అంశాలపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలిస్తామని ప్రభుత్వం చేస్తున్న సూచనతో రైతు సంఘాలు ఏకీభవించడం లేదు. ఎనిమిది పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ, ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిశాయి. ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి కేంద్రం జరుపుతున్న చర్చలు అత్యంత అసంతృప్తికి గురి చేస్తు న్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైతే వివాదాస్పద చట్టాల అమలు మీద స్టే విధించే అవకాశాన్ని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సయోధ్యకు కొంత గడువు ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇచ్చామని తెలిపింది. “మీకు ఎక్కువ సమయమే ఇచ్చాం. మాకు సహనం గురించి పాఠాలు చెప్పకండి” అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బోబ్డే ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఇందులో న్యాయమూర్తులు ఎ.ఎస్‌.బోపన్న, వి.రామసుబ్రమణియన్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం రైతుల ఆందోళనల విషయంలో ఘాటుగా వ్యా ఖ్యానించిందని అన్నారు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా. రైతు ఆందోళనల అంశం మీద ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన కోర్టు, ఈ విషయంలో ఇద్దరు ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పేర్లు తెలపాలని కోరింది. ఈ సంఘానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎం.లోధా అధ్యక్షులుగా ఉంటారని కోర్టు తెలిపింది.
మీరు చేస్తారా? మేమే చెయ్యాలా?
విచారణ మొదట్లోనే ధర్మాసనం “అసలేం జరుగుతోంది? మీ చట్టాలకు రాష్ట్రాలు తిరగబడుతున్నాయి” అని వ్యాఖ్యానించింది. “సంప్రదింపులు జరుగుతున్న క్రమంపై మేం తీవ్ర అసంతృప్తితో ఉన్నాం” అన్న ధర్మాసనం, “మీ సంప్రదింపుల మీద మేం ఏదో ఒకటి వ్యాఖ్యానించలేం. కానీ జరుగుతున్న తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాం” అని పేర్కొంది. కొత్త సాగు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వివిధ వ్యాజ్యాలు, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు సంబంధించిన వ్యాజ్యాలను విచారణ చేస్తున్న సుప్రీం కోర్టు ఇప్పటికిప్పుడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పట్లేదని స్పష్టంచేసింది. “ఇది చాలా సున్నితమైన పరిస్థితి” అన్న న్యాయస్థానం, “వ్యవసాయ చట్టాలు ప్రయోజనకరం అని చెప్పే ఒక్క పిటిషన్‌ కూడా మా దగ్గర లేదు” అని తెలిపింది. “మేమేమీ ఆర్థిక నిపుణులం కాదు. ప్రభుత్వం సాగు చట్టాలను నిలిపివేస్తుందా లేక ఆ పని మేము చేయాలా” అని ధర్మాసనం ప్రశ్నించింది. “సమస్యను, రైతుల ఆందోళనను కేంద్రం పరిష్కరించ లేకపోతోందని చెప్పడానికి మేం విచారిస్తున్నాం” అని న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. అయితే ప్రాథమిక హక్కులు లేదా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉంటే తప్ప, మరే ఇతర సందర్భాల్లోనూ చట్టాలపై కోర్టు స్టే విధించలేదని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదించారు.
పరిష్కారంలోనా… సమస్యలోనా…
“దీనంతటికీ మనం ఒక మంచి పరిష్కారం కనుక్కుంటామా అన్నదే మా ఉద్దేశం. అందుకే మీరు చట్టాలను కొంతకాలం నిలిపి ఉంచగలుగుతారా అని అడిగాం. కానీ మీరు మరింత సమయం అడుగుతున్నారు” అన్న ధర్మాసనం, “అసలు మీరు పరిష్కారంలో భాగమా లేదా సమస్యలో భాగంగా ఉన్నారా అన్నది అర్థం కావడం లేదు” అని ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ధర్మాసనం ప్రభుత్వం, దేశవ్యాప్త రైతు సంఘాల ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటించింది. ఒకవేళ ప్యానల్‌ సలహా ఇస్తే చట్టాల అమలును ఆపివేయాలని సూచించింది. నిరసన చేస్తున్న రైతులు తమ ఆక్షేపణలను ఆ కమిటీకి నివేదిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వం తనంతట తాను పనిచేయకపోతే చట్టాల మీద స్టే ఇస్తానని సుప్రీం కోర్టు తెలిపింది. “మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, మేం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, మా కర్తవ్యం మేం నిర్వహిస్తాం” అని ధర్మాసనం నిరసన చేస్తున్న రైతు సంఘాలతో వెల్లడించింది.
వామపక్ష నాయకులతో పవార్‌ భేటీ
వివాదాస్పద సాగు చట్టాలు, రైతుల ఆందోళనల మీద సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సోమవారం వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజాతో భేటీ అయ్యారు. రైతుల ఆందోళన గురించి చర్చించారు. “మేం అనధికారికంగా సుప్రీం కోర్టు ఉత్తర్వు గురించి చర్చించాం. అయితే ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది మాత్రం రైతులే. దీనికి స్పందించాల్సింది వారే. చట్టాలను రద్దు చేయాలన్న వారి డిమాండ్‌కు మేం మద్దతిస్తున్నాం” అని సిపిఐ జనరల్‌ సెక్రటరీ డి.రాజా అన్నారు.
స్టే పరిష్కారం కాదు
అయితే కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు స్టే ఇచ్చినప్పటికీ తమ ఆందోళన ఆగదని సోమవారం రైతు నాయకులు స్పష్టంచేశారు. “ఇది మా వ్యక్తిగత అభిప్రాయం” అని, నిలిపి ఉంచడం అంటే పరిమిత కాలానికే కనుక “అది పరిష్కారం కాదు” అని రైతు నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివాదాస్పద చట్టాల మీద సోమవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును “మేం సుప్రీం కోర్టు పరిశీలనను స్వాగతిస్తున్నాం. కానీ నిరసన ముగించడం ఒక మినహాయింపు కాదు. స్టే ఏదైనా సరే అది పరిమిత కాలానికే… కోర్టు ఈ అంశాన్ని మళ్లీ తీసుకునేవరకే” అని హర్యానా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్‌నామ్‌ సింగ్‌ చడూనీ అన్నారు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే. ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు వాటి అమలును నిలిపివేసినా మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది” అని గుర్‌నామ్‌ అన్నారు. ఇవి రాజ్యాంగ బద్ధం కాదు కనుక సుప్రీం కోర్టే వీటికి భరతవాక్యం పలకాలని ఇండియన్‌ ఫార్మర్స్‌ యూనియన్‌ (మాన్సా) అధ్యక్షుడు భోగ్‌ సింగ్‌ మాన్సా విజ్ఞప్తిచేశారు. చట్టాలు రద్దు చేయకుంటే బిజెపి ప్రభుత్వం ఉన్నంతవరకు నిరసన సాగుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.
ఇక ఢిల్లీ సరిహద్దుల్లో 47 రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సింఘు సరిహద్దుల దగ్గర సేవా స్ఫూర్తి వెల్లివిరిసింది. ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలోని శీశ్‌గంజ్‌ గురుద్వారా నుంచి వచ్చిన కొంతమంది సేవకులు సింఘు దగ్గర నిరసనకారుల చెప్పులు, బూట్లకు ఉచితంగా పాలిష్‌చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. సోమవారం నాడు ఉపన్యాసాలు, పోరాట గీతాలు, నినాదాలతో నిరసన స్థలం మారుమోగింది.
సంబంధించిన వ్యాజ్యాలను విచారణ చేస్తున్న సుప్రీం కోర్టు ఇప్పటికిప్పుడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పట్లేదని స్పష్టంచేసింది. “ఇది చాలా సున్నితమైన పరిస్థితి” అన్న న్యాయస్థానం, “వ్యవసాయ చట్టాలు ప్రయోజనకరం అని చెప్పే ఒక్క పిటిషన్‌ కూడా మా దగ్గర లేదు” అని తెలిపింది. “మేమేమీ ఆర్థిక నిపుణులం కాదు. ప్రభుత్వం సాగు చట్టాలను నిలిపివేస్తుందా లేక ఆ పని మేము చేయాలా” అని ధర్మాసనం ప్రశ్నించింది. “సమస్యను, రైతుల ఆందోళనను కేంద్రం పరిష్కరించ లేకపోతోందని చెప్పడానికి మేం విచారిస్తున్నాం” అని న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. అయితే ప్రాథమిక హక్కులు లేదా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉంటే తప్ప, మరే ఇతర సందర్భాల్లోనూ చట్టాలపై కోర్టు స్టే విధించలేదని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదించారు.
పరిష్కారంలోనా… సమస్యలోనా…
“దీనంతటికీ మనం ఒక మంచి పరిష్కారం కనుక్కుంటామా అన్నదే మా ఉద్దేశం. అందుకే మీరు చట్టాలను కొంతకాలం నిలిపి ఉంచగలుగుతారా అని అడిగాం. కానీ మీరు మరింత సమయం అడుగుతున్నారు” అన్న ధర్మాసనం, “అసలు మీరు పరిష్కారంలో భాగమా లేదా సమస్యలో భాగంగా ఉన్నారా అన్నది అర్థం కావడం లేదు” అని ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ధర్మాసనం ప్రభుత్వం, దేశవ్యాప్త రైతు సంఘాల ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటించింది. ఒకవేళ ప్యానల్‌ సలహా ఇస్తే చట్టాల అమలును ఆపివేయాలని సూచించింది. నిరసన చేస్తున్న రైతులు తమ ఆక్షేపణలను ఆ కమిటీకి నివేదిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వం తనంతట తాను పనిచేయకపోతే చట్టాల మీద స్టే ఇస్తానని సుప్రీం కోర్టు తెలిపింది. “మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, మేం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, మా కర్తవ్యం మేం నిర్వహిస్తాం” అని ధర్మాసనం నిరసన చేస్తున్న రైతు సంఘాలతో వెల్లడించింది.
వామపక్ష నాయకులతో పవార్‌ భేటీ
వివాదాస్పద సాగు చట్టాలు, రైతుల ఆందోళనల మీద సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సోమవారం వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజాతో భేటీ అయ్యారు. రైతుల ఆందోళన గురించి చర్చించారు. “మేం అనధికారికంగా సుప్రీం కోర్టు ఉత్తర్వు గురించి చర్చించాం. అయితే ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది మాత్రం రైతులే. దీనికి స్పందించాల్సింది వారే. చట్టాలను రద్దు చేయాలన్న వారి డిమాండ్‌కు మేం మద్దతిస్తున్నాం” అని సిపిఐ జనరల్‌ సెక్రటరీ డి.రాజా అన్నారు.
స్టే పరిష్కారం కాదు
అయితే కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు స్టే ఇచ్చినప్పటికీ తమ ఆందోళన ఆగదని సోమవారం రైతు నాయకులు స్పష్టంచేశారు. “ఇది మా వ్యక్తిగత అభిప్రాయం” అని, నిలిపి ఉంచడం అంటే పరిమిత కాలానికే కనుక “అది పరిష్కారం కాదు” అని రైతు నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివాదాస్పద చట్టాల మీద సోమవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును “మేం సుప్రీం కోర్టు పరిశీలనను స్వాగతిస్తున్నాం. కానీ నిరసన ముగించడం ఒక మినహాయింపు కాదు. స్టే ఏదైనా సరే అది పరిమిత కాలానికే… కోర్టు ఈ అంశాన్ని మళ్లీ తీసుకునేవరకే” అని హర్యానా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్‌నామ్‌ సింగ్‌ చడూనీ అన్నారు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే. ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు వాటి అమలును నిలిపివేసినా మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది” అని గుర్‌నామ్‌ అన్నారు. ఇవి రాజ్యాంగ బద్ధం కాదు కనుక సుప్రీం కోర్టే వీటికి భరతవాక్యం పలకాలని ఇండియన్‌ ఫార్మర్స్‌ యూనియన్‌ (మాన్సా) అధ్యక్షుడు భోగ్‌ సింగ్‌ మాన్సా విజ్ఞప్తిచేశారు. చట్టాలు రద్దు చేయకుంటే బిజెపి ప్రభుత్వం ఉన్నంతవరకు నిరసన సాగుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో 47 రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సింఘు సరిహద్దుల దగ్గర సేవా స్ఫూర్తి వెల్లివిరిసింది. ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలోని శీశ్‌గంజ్‌ గురుద్వారా నుంచి వచ్చిన కొంతమంది సేవకులు సింఘు దగ్గర నిరసనకారుల చెప్పులు, బూట్లకు ఉచితంగా పాలిష్‌చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. సోమవారం నాడు ఉపన్యాసాలు, పోరాట గీతాలు, నినాదాలతో నిరసన స్థలం మారుమోగింది.

DO YOU LIKE THIS ARTICLE?