నిర్లక్ష్యం మింగేసింది!

క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ప్రజాపక్షం/సంగారెడ్డి  : ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌ కాలనీలో జరిగింది. ఇళ్ల సమీపంలోగల నీటి గుంతల వద్దకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.మృతులను కృష్ణా(9), నివర్తి (12), సందేశ్‌(9)లుగా గుర్తించారు. వారి తల్లిదండ్రులు 10 ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చి హనుమాన్‌నగర్‌ కాలనీకి వలసవచ్చారు. రోజూ కూలీ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న తమ కుటుంబాల్లో అక్రమ మట్టి తవ్వకాలు చిచ్చురేపాయని చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మట్టిని తవ్వుకున్న అనంత రం గుంతల్ని పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?