నిఘా నిద్రపోతోంది!

సరిహద్దులు దాటుతున్న సరుకులు
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
అక్రమ దందాలకు అడ్డ్డాగా హుజూర్‌నగర్‌
ప్రజాపక్షం/సూర్యాపేటబ్యూరో
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ్ధ నిద్రపోతోంది. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. విధులు నిర్వహించే అధికారుల వైఫల్యం అడుగడుగున కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండటంతో నిఘా వ్యవస్థ నీరుగారిపోతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో నిషేధిత పదార్థ్ధాలు, వస్తువులు, సడీసప్పుడు కాకుండా సరిహద్దులు దాటుతూ జిల్లాకు చేరుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కృష్టపట్టె ప్రాంతంలోని రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే పలువురు అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ రవాణాకు దారులు తెరిచారు. ఇదే అదునుగా భావించిన అనేక మంది అక్రమ వ్యాపారులు ఆంధ్రా నుంచి నిషేధిత పదార్థ్ధాలు, వస్తువులు జిల్లాకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకొని అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న దీనిపై ‘ప్రజాపక్షం’ ప్రత్యేక కథనం.
సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతర్‌ జిల్లా, అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను పెట్టి కొంతమంది పోలీసు అధికారులను, సిబ్బందిని నియామకం చేసింది. ఈ చెక్‌ పోస్టుల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఏలాంటి అలసత్వం ప్రదర్శించడకుండా వచ్చి వేళ్ళే వాహనాలను క్షుణంగా తనిఖీలు చేసిన తరువాతే అక్కడి నుండి పంపించాల్సి ఉంది. కానీ కొందరు అధికారులు మాత్రం అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏలాంటి తనిఖీలు చేయకుండా వారు ఇచ్చింది పుచ్చుకొని పంపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయగా ఇవి మేళ్ళచెరువు మండలం బుగ్గమదారం, చింతలపా లెం మండలం పులిచింతల, కోదాడ సమీపంలో రామాపురం ఎక్స్‌ రోడ్డు, మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇకపోతే అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు ఐదు ఉండగా ఇవి నేరేడుచర్ల, తిరుమలగిరి, మోతె, మద్దిరాల మండలం కుంట్లపల్లి వద్ద ఏర్పాటు చేశారు ఇక్కడ నిఘా వ్యవస్థ్ధను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయినా అక్రమ రవాణా మాత్రం ఏమాత్రం అగడం లేదు. కొంతమంది అవినీతి అధికారుల వల్ల ఇది జరుగుతుందని ప్రతిపక్షా నాయకులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధి లో నిఘా విభాగం మొత్తం అవినీతి మయం అయిందం టూ నల్లగొండ పార్లమెంట్‌ సభ్యులు, టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బహిరంగంగానే పత్రిక ముఖంగా ఆరోపిస్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో నిషేధిత గుట్కా, బెల్లంతో పాటు కరోనాతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మూలంగా మద్యం విక్రయాలు బంద్‌ కావడంతో ఆంధ్రా ప్రాంతం నుండి పెద్ద ఎత్తున అక్రమార్కులు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యి. కృష్ణ పరివాకం, మఠంపల్లి మండలం యాతవాకిల వద్ద ఉన్న వేమూలూరి ప్రాజెక్ట్‌ నుండి కూడా ఇసుక తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?