నాలుగో రౌండ్‌లో లక్ష్యసేన్‌

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌
గువహాటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చా ంపియన్‌షిప్‌లో యువ ఆటగాడు లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌ నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. మరోవైపు సౌరభ్‌ వర్మ, రితుపూర్ణ దాస్‌, హర్షిల్‌ దాని కూడా నాలుగో రౌండ్‌కు అర్హత సాధించా రు. 83వ జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ లో 17 ఏళ్ల యువ సంచలనం లక్ష్యసేన్‌ వరుస గా మూడో విజయంతో సత్తా చాటుతున్నాడు. ఏ షియన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న ల క్ష్యసేన్‌ గత ఏడాది జరిగిన వరల్డ్‌ జూనియర్‌ చా ంపియన్‌షిప్‌లోనూ కాంస్య పతకం సాధించాడు. తన అద్భుతమైన ఆటతో అందరిని ఆకర్షిస్తున్నా డు. వరుస విజయాలతో భారత యువ కిరీటంగా ఎదుగుతున్నాడు. బుధవారం ఇక్కడ జరిగిన పు రుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 21 21 తేడాతో విపుల్‌ సైనీని వరుస గేమ్‌లలో చిత్తు చేశాడు. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన లక్ష్యసేన్‌ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంత చెలాయించాడు. మధ్యలో విపుల్‌ కొంతగా ప్రతిఘటించినా.. చివర్లో లక్ష్యసేన్‌ జో రును పెంచి తొలి గేమ్‌ను 21 గెలుచుకున్నాడు. తర్వాతి గేమ్‌లోనూ జోరును కనబర్చిన లక్ష్యసేన్‌ 21 తేడాతో గేమ్‌తో పాటు మ్యా చ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. పురుషుల మరో సింగిల్స్‌లో హర్షిల్‌ దాని 21 21 15తో ఏడో సీడ్‌ బాల్‌రాజ్‌ కజ్లాపై విజయం సా ధించి నాలుగో రౌండ్‌లో దూసుకెళ్లాడు.
సౌరభ్‌ వర్మ కూడా..
పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో మాజీ చాం పియన్‌ సౌరభ్‌ వర్మ కూడా విజయం సాధించి ముందుంజ వేశాడు. ఇక్కడ జరిగిన మూడో రౌం డ్‌లో సౌరభ్‌ వర్మ 18 21 21 కె. జగదీష్‌పై గెలుపొందాడు. మొదటి గేమ్‌లో తడబడిన సౌరభ్‌ రెండో గేమ్‌లో మాత్రం దూకుడైన ప్రదర్శనతో చెలరేగాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 21 ఏకపక్షంగా ఈ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లోనూ విజృంభించి ఆడాడు. మొదట ఇద్దరూ హోరాహోరీగా తలపడినా చివర్లో దూకుడును పెంచిన సౌరభ్‌ వర్మ చివరి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఇతర మ్యాచుల్లో రాహుల్‌ యాదవ్‌, ప్రియాన్షు రాజవత్‌, మునవెర్‌ మహ్మద్‌, అలప్‌ మిశ్ర తదితరులు విజయలు సాధించి తర్వాతి రౌండ్‌లో ప్రవేశించారు.
రితుపర్ణ, గాయత్రి ముందంజ..
ఇక మహిళల సింగిల్స్‌ విభాగంలో మాజీ చాంపియన్‌ రితుపర్ణ దాస్‌, గాయత్రి గోపీచంద్‌ నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో రితుపర్ణ దాస్‌ 21 21 తేడాతో సలొని కుమారిని వరుస గేమ్‌లలో చిత్తు చేసి ముందంజ వేసింది. మరోవైపు తెలంగాణ యువ క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్‌ కూడా నాలుగో రౌండ్‌కు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ ఇతర మ్యాచుల్లో రియా ముఖర్జీ, మాల్విక, శిఖ గౌతమ్‌, రేశ్మ కార్తిక్‌, నేహ పండిత్‌, శృతి ముందడ తదితరులు విజయాలు సాధించి తర్వాతి రౌండ్‌లో దూసుకెళ్లారు.

DO YOU LIKE THIS ARTICLE?