కివీస్‌ గడ్డపై తొలిసారి 4-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌

మెరిసిన రాయుడు.. రాణించిన శంకర్‌, చాహల్‌ .. పాండ్యా ఆలౌరౌండ్‌ షో
 చివరి వన్డేలో న్యూజిలాండ్‌ చిత్తు
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై టీమిం డియా నయా చరిత్ర సృష్టించింది. 52 ఏళ్లుగా సాధ్యంకాని ఘనతను భారత్‌ సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 35 పరుగులతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4 కైవసం చేసుకుంది. కివీస్‌ గడ్డపై టీమిండి యాకు ఇదే అతి పెద్ద సిరీస్‌ విజయం. 1967 నుంచి న్యూజిలాండ్‌ పర్యటనకు వెళుతున్న భారత్‌ (2008 పర్యట నలో 3 సిరీస్‌ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఆ రికార్డును సవరిం చింది. ఆసీస్‌ పర్యటను విజయంతంగా ముగించించుకొని కివీస్‌ గడ్డపై అడుగుపె ట్టిన టీమిండియా ఇక్కడ కూడా చిరస్మర ణీయ విజయాలతో వన్డే సిరీస్‌ను గెలు చుకుంది. ఇక బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్‌ ఆల్‌రౌం డర్‌ ప్రదర్శనతో మరో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ సమిష్టిగా రాణిం చింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత (49.5 ఓవర్లలో) 252 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను హైదరాబాద్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు (90; 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆదు కున్నాడు. మరోవైపు విజయ్‌ శంకర్‌ (45), కేదర్‌ జాదవ్‌ (35) పరుగులతో రాణిం చగా.. చివర్లో హార్దిక్‌ పాండ్యా (45; 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరును ప్రత్యర్థి జట్టుకి నిర్దేశించగలి గింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ భారత బౌలర్ల ధాటికి (44.1 ఓవర్లలో) 217 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 35 పరుగుల ఘన విజయం దక్కింది. భారత బౌలర్లలో యాజువేంద్ర చాహల్‌ మూడు వికెట్లతో విజృంభించగా.. మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసి అతనికి అండగా నిలి చారు. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అంబటి రాయుడు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. మరోవైపు సిరీస్‌లో బంతితో మెరిసిన భారత స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు.

టాప్‌ ఆర్డర్‌ ఢమాల్‌..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. కివీస్‌ పేసర్లు మరోసారి పదునైన బంతులతో భారత్‌ బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకుపడ్డారు. ఒకవైపు మాట్‌ హెన్రీ, మరోవైపు ట్రెంట్‌ బౌల్ట్‌ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో భారత సారథి రోహిత్‌ శర్మ (2), శిఖర్‌ ధావన్‌ (6) పరుగులు మాత్రేమే చేసి పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌ 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా పెద్ద స్కోరు చేయలేక పోయాడు. బంతి స్వింగ్‌ అవడంతో కివీస్‌ బౌలర్లకు కలిసి వచ్చింది. వీరి ధాటికి శుభ్‌మన్‌ గిల్‌ కూడా (7) పరుగులకే ఇంటి దారి పట్టాడు. తర్వాత భారీ అంచనాలతో క్రీజుపై అడుగుపెట్టిన భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (1) తీవ్రంగా నిరాశ పరిచాడు. గాయం కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమైన ధోనీ ఈ వన్డే ద్వారా పునరాగమనం చేశాడు. కానీ తన స్థాయికి తగ్గట్టు రాణించలేక పోయాడు. బౌల్ట్‌ వేసిన బంతికి క్లీన్‌ బౌల్డ్‌గా మైదానం వీడాడు. దీంతో భారత్‌ 9.3 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న రాయడు, శంకర్‌..

అనంతరం హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు, ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ భారత్‌ను అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఒకవైపు తమ వికెట్లను కాపాడుకుంటునే మరోవైపు పరుగులు సాధిస్తూ చిరస్మరణీయ బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే వీరూ ఐదో వికెట్‌కు 77 బంతుల్లో 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు టీమిండియా 28.6 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. మొదట్లో కుదురుగా ఆడిన వీరు తర్వాత తమ వేగాన్ని పెంచారు. వరుస బౌండరీలతో స్కోరుబోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడుతున్న కేదర్‌ జాదవ్‌ (45; 64 బంతుల్లో 4 ఫోర్లు) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్నౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 116 పరుగుల వద్ద కీలకమైన ఐదో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం వచ్చిన కేదర్‌ జాదవ్‌తో కలిసి రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే రాయుడు 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అనంతరం ఇతను చెలరేగి ఆడడంతో టీమిండియా కూడా 150 పరుగుల మార్కును దాటింది. మరోవైపు జాదవ్‌ కూడా దూకుడు పెంచాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ జోడీ కూడా ఆరో వికెట్‌కు 49 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించిన రాయుడు (90; 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హెన్రీ బౌలింగ్‌లో మున్రోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రాయుడు తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఇతను జాదవ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
పాండ్యా మెరుపులు..
అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ హర్ధిక్‌ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్‌ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై తన ప్రతాపాన్ని చూపెడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు బాధ్యతగా ఆడుతున్న కేదర్‌ జాదవ్‌ (45 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. మరోవైపు పాండ్యా మాత్రం విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. స్పిన్నర్‌ ఆస్ట్‌లే వేసిన ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సర్లు కొట్టి తన ఉనికిని చాటుకున్నాడు. జట్టులో తన ప్రాధాన్యత ఎంటో అందరికి చూపించాడు. చివరికి పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45) పరుగులను నీషమ్‌ ఔట్‌ చేశాడు. ఇక తర్వాత భువనేశ్వర్‌ (6), షమీ (1 రనౌట్‌) అవడంతో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆఔటైంది. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ మూడు వికెట్లు దక్చించుకున్నాడు.
ఓపెనర్లకు షమీ దెబ్బ..
అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆదిలోనే మహ్మద్‌ షమీ దెబ్బేశాడు. మొదట కుదురుగా ఆడుతున్న హెన్రీ నికొలాస్‌ (15 బంతుల్లో 8)ను ఔట్‌ చేసిన షమీ.. ఆ కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (19 బంతుల్లో 24)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో కివీస్‌ 37 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఒక పరుగు వ్యవధిలోనే డేంజరస్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (1)ను హార్దిక్‌ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ పంపి కివీస్‌కు పెద్ద షాకిచ్చాడు.
చెలరేగిన చాహల్‌..
అనంతరం కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, కీపర్‌ టామ్‌ లాథమ్‌ తెలివైన బ్యాటింగ్‌తో తమ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కొద్ది సేపటి వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. వీరిద్దరూ సమనయంతో ఆడుతూ పిచ్‌పై పాతుకుపోయారు. చాలా సేపటి వరకు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ 23.6 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసింది. నాలుగో వికెట్‌కు కీలకమైన 67 పరుగులు జోడించిన అనంతరం ఈ ప్రమాదకరమైన జోడీని కేదర్‌ జాదవ్‌ విడగొట్టాడు. విలియమ్సన్‌ (73 బంతుల్లో 39) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే లాథమ్‌ (37)ను చాహల్‌ ఎబ్లీడబ్ల్యూ చేశాడు. తర్వాత మరో కీలక బ్యాట్స్‌మన్‌ గ్రాండ్‌హూమ్‌ (11)ను కూడా ఔట్‌ చేసి చాహల్‌ కివీస్‌ ఓటమి దాదాపు ఖరారు చేశాడు. భారత్‌ విజయం ఖాయమనుకున్న సమయంలో నీషమ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కివీస్‌ విజయం ఆశలు మరోసారి చిగురించాయి. కానీ చివర్లో ధోనీ తన అద్భుతమైన టాలెంట్‌తో చెలరేగి ఆడుతున్న జెమ్స్‌ నీషమ్‌ (44; 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను రన్నౌట్‌గా పెవిలిన్‌ పం పాడు. ఇక ఆఖర్లో ఆస్ట్‌లే (10)ను చాహల్‌, ట్రెం ట్‌ బౌల్ట్‌ (1)ను భువనేశ్వర్‌లు ఔట్‌ చేయడంతో కివీస్‌ 44.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. ధాటిగా ఆడిన మాట్‌ హెన్రీ 9 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో యాజువేంద్ర చాహల్‌ మూడు వికెట్లు తీయగా.. షమీ, పాండ్యా తలో రెండు, కేదర్‌ జాదవ్‌, భువనేశ్వర్‌ చెరోక వికెట్‌ దక్కించుకున్నారు. అందరూ కలిసి కట్టుగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురుసింది. మాజీ క్రికెటర్లతో పాటు, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా భారత జట్టును అభినందించారు. ఇక 6వ తేదీన భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది.

DO YOU LIKE THIS ARTICLE?