నడినెత్తిన నరకం ఖమ్మం @ 46

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక మీదుగా వీస్తున్న వేడిగాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే రెండు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదల ఆదిలాబాద్‌లో నమోదయింది. సోమవారం ఇక్కడ 42 డిగ్రీలు కాగా మంగళవారం 44 డిగ్రీలు నమోదయింది. కాగా ఖమ్మంలో సోమవారం 45.2 డిగ్రీలు ఉండగా, మంగళవారం 46, నిజామాబాద్‌లో సోమవారం 43 డిగ్రీలు కాగా, మంగళవారం 44 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో సోమవారం 42 డిగ్రీలు నమోదు కాగా మంగళవారం 43 డిగ్రీలు నమోదయింది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఉం టుందని హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరగడం తో పాటు వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో గరిష్టంగా ఖమ్మంలో 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి, జనగాం, యాదాద్రి, వరంగల్‌ మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లా లో వడగాల్పులు వీచనున్నాయి. అత్యవసరమైతే తప్ప గడపదాటి బయటకు రాని పరిస్థితులు మే మొదటి వారంలోనే నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి వర్షాలు కూడా జూలై వరకు ఉండక పోవచ్చని, జూన్‌లో కూడా ఎండలు మండుతాయని వాతావరణ కేంద్రం సూత్రప్రాయంగా తెలిపింది. దీంతో ఇంతటి ఎండలను మరో రెండు నెల లు భరించాల్సిన పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నీటి ఎద్దడి నెలకొంది. అడవుల్లో జంతువులకు, వన్యప్రాణులకోసం ట్యాంక్‌లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో బావు లు, బోర్లు ఎండిపోయాయి. ప్రధానంగా వృద్ధులు, పిల్లలు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?