ద్వి శతకం సాధించే సత్తా మంధానాకే ఉంది!

ముంబయి : మహిళల వన్డే క్రికెట్‌లో భారత తరఫున డబుల్‌ సెంచరీ చేసే సత్తా స్మృతి మంధానకే ఉందని స్టార్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ తెలిపింది. పురుషుల క్రికెట్‌లో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తొలిసారి 2010లో ఈ ఫీట్‌ నెలకొల్పి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అనంతరం వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌ డబుల్‌ శతకాలు బాదారు. భారత హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ అయితే ఏకంగా మూడు ట్రిపుల్‌ సెంచరీ బాదాడు. అంతేకాకుండా 264 పరుగులతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కలిగిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుకెక్కాడు. మహిళల వన్డే క్రికెట్‌లో కూడా ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ అమెలియ కెర్‌, ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెలింద క్లార్క్‌ ఈ అరుదైన ఘనతనందుకున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ అమెలియ కెర్‌ 232 నాటౌట్‌ పరుగులతో ఈ ఫీట్‌ అందుకోగా.. డెన్మార్క్‌పై బెలింద క్లార్క్‌ 229 నాటౌట్‌ ఈ ఫీట్‌ సాధించింది.
భారత్‌ నుంచి మంధాననే..
ఇక భారత తరఫున 2017లో దీప్తిశర్మ ఐర్లాండ్‌పై 188 పరుగులు చేసింది. ఇదే భారత బ్యాటర్ల తరఫున అత్యధిక స్కోర్‌. ఈ నేపథ్యంలో పూనమ్‌ యాదవ్‌ను ఓ యూజర్‌..‘ ప్రస్తుత భారత మహిళా జట్టులో వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించే సత్తా ఎవరికి ఉంది?’అని ప్రశ్నించాడు. దీనికి పూనమ్‌.. స్మృతి మంధానకే ఆ సత్తా ఉందని సమాధానం ఇచ్చింది. కాగా, కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు రద్దవ్వడంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో సరదాగా ఇంటరాక్ట్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్‌.. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మరో యూజర్‌ ఏ క్రికెటర్‌కు బౌలింగ్‌ చేయడం కష్టంగా ఫీలవుతారనడగగా.. న్యూజిలా్‌ండ బ్యాటర్‌ సోఫి డివైన్‌ అని తెలిపింది. ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఆడాలనుకుంటున్నావని ట్విటర్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘అవకాశం దక్కితే చెన్నై తరఫున బౌలింగ్‌ చేయాలనుకుంటున్నా’ అని పూనమ్‌ సమాధానమిచ్చింది.

DO YOU LIKE THIS ARTICLE?