‘దళితబంధు’ ఆగదు

ఆరునూరైనా అమలు చేస్తాం
సిఎం కెసిఆర్‌ స్పష్టీకరణ
దశల వారీగా 400 కుటుంబాలకు అమలు
రైతుబంధు తరహాలో చేనేత బీమా పథకం
ప్రజాపక్షం/హైదరాబాద్‌‘దళితబంధు’ పథకాన్ని ఆరునూరైనా అమలు చేస్తామని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. దశల వారీగా రెండు నుంచి 400 కుటుంబాలకు అమ లు చేస్తామన్నారు. దళిత బంధు పథకం గత ఏడాదే అమలు కావాల్సిందని, కరోనా నేపథ్యంలోనే ఏడాది ఆలస్యమైందన్నా రు. దళిత బంధు ఒక మహా యజ్ఞం లాంటిదన్నారు. రైతుబంధు తరహాలోనే చేనేత బీమా పథకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇదే తరహా సంక్షేమ కార్యక్రమాన్ని దళిత వర్గాలకు అందేలా ప్రయత్నించాలని ఆ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సిఎం సూచించారు. దళిత బంధు ప్రకటించగానే ‘కీ..కా”అంటూ ఎందుకంత బాంబు పడ్డట్టు అదిరి పడుతున్నారని,అంత భయమేందుకని ప్రశ్నించారు. గోల్‌మాల్‌ చేసి చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ‘నన్ను’ చంపినా అలా చెప్పనని, అయినా ఎందుకు?, ఎవరి కోసం చేబుతామని అన్నారు. కొందరు అసహన వైఖరితో, జీర్ణించుకోక అరాచక విధానంలో అడ్డం, పొడువుగా అశ్లీల భాషతో అరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనుగు పోతుంటే చిన్న జంతువులు అరుస్తుంటాయని, వాటిని తాము పట్టించుకోమన్నారు. ఇటీవల బిజెపికి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇ.పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ నేత స్వర్గం రవితో పాటు బిజెపికి చెందిన నేతలు, పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ తిలక్‌ పలువురు కెసిఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువను కప్పి కెసిఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల జనాభా 18- శాతం ఉంటుందన్నారు. ఏకానకు పనికిరానోళ్లు కూడా కయ్యా.. కయ్యా అని ఒర్లుతున్నారని, మహా, మహా మేధావులు ప్రస్తుత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, కంటి వెలుగు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని, ఆ ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కంటి వెలుగు ఒక కులానికి, మతానికి సంబంధం లేదని, మనిషిని మనిషిగా చూడడమే ప్రభుత్వ విధానమన్నారు. ఇప్పుడు తెలంగాణ లైన్‌లో పడిందని,ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగుతుందని, ప్రజలు ఈ లైన్‌ను వదిలిపెట్టుకోరని, ప్రజలే దీనిని కాపాడుకుంటారన్నారు.
‘పాలమూరు, సీతరాములు’ పూర్తయతే కశ్మీర్‌ ఖండంగా తెలంగాణ
పాలమూరు, సీతరామప్రాజెక్ట్‌లు పూర్తయతే తెలంగాణ కశ్మీర్‌ ఖండం అవుతుందని కెసిఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఏ రంగంలో తెలంగాణ నంబర్‌ వన్‌ అనేది పార్లమెంట్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుందన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని, ఆకలి చావులు లేవన్నారు. అతి తక్కువ ఆత్మహత్యలలో తెలంగాణ ఉన్నదని కేంద్రం చెప్పిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు.
కన్న తల్లిదండ్రులను చూడనోడు దేశానికి ఏం సేవ చేస్తడు
కన్న తల్లిదండ్రులను చూడనోడు దేశానికి ఏం సేవలు అందిస్తారని, తల్లిదండ్రులను చూడనోడు బేకార్‌గాడని సిఎం కెసిఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష వరకు జీతాలు వస్తున్నాయని, వారు తమ తల్లిదండ్రులకు రెండు వేల రూపాయాలు ఇస్తే ఏం పోతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఒక సమావేశంలో తనను కలిసి కొడుకు చూడడం లేదని వాపోయారని గుర్తు చేశారు. ఆశవర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనంలో సగం కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలలో అమలు చేయడం లేదన్నారు. హోమ్‌గార్డ్‌కు దగ్గర దగ్గర రూ.50వేల జీతం వస్తుందని, దేశంలో ఇంత జీతం ఎక్కడా ఇవ్వరన్నారు.
గులాబీ కండువ కప్పుకుంటానని జానా మాట తప్పారు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తే గులాబీ కండువ కప్పుకుని, టిఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తానని చెప్పిన కాంగ్రెస్‌ నేత జానారెడ్డి మాట తప్పారని, ఇటీవల జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేశారని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోనప్పుడు ఎవరు ఎక్కడ పండుకున్నారో తెలియదని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత తానే సిపాయి అని, ఉద్యమంలో చివరగా వచ్చినోడు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ

DO YOU LIKE THIS ARTICLE?