తొలి వన్డేలో న్యూజిలాండ్‌ గెలుపు

నీషమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌..
45 పరుగులతో లంక చిత్తు
మౌంట్‌ మౌంగనుయ్‌: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 45 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యా టింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్‌ బ్యాట్స్‌మన్‌ నీషమ్‌ (13 బంతుల్లోనే 6 సిక్సర్లతో అజేయంగా 43 పరుగులు చేశాడు. ఇతను చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాదీ సంచలనం సృష్టించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 1 ఆధిక్యం సాధించిం ది. గురువారం తొలి వన్డేలో 327 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిరోషన్‌ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలు శుభారంభాన్ని అందించారు. వీరు తొలి వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 119 పరుగులు జోడించారు. అనంతరం దనుష్క (62 బంతుల్లో 43) పరుగులు చేసి నీషమ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న డిక్వెల్లా (76; 50 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా నీషమ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత కుశాల్‌ పెరీరా అద్భుతమైన బ్యాటింగ్‌తో లంక ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇతనికి మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు కుశాల్‌ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ పోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించిన కుశాల్‌ పెరీరా చివరికి (102; 86 బంత్లు 13 ఫోర్లు, 1 సిక్స్‌) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత లంక 49 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటై 45 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది. కివీస్‌ బౌలర్లలో జేమ్స్‌ నీషమ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గ్యూసన్‌, ఇష్‌ సోధీ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మున్రో (13) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్‌ గుప్టిల్‌, కెప్టెన్‌ విలియమ్‌సన్‌ అదుతమైన బ్యాటింగ్‌తో కివీస్‌ను ఆదుకున్నారు. వీరు రెండో వికెట్‌కు 163 పరుగులు జోడించారు. అనంతరం దూకుడుగా ఆడుతున్న విలియమ్‌సన్‌ (74 బంతుల్లో 76) పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రాస్‌ టేలర్‌ కూడా చెలరేగడంతో కివీస్‌ భారీ స్కోరువైపు ప్రయాణించింది. అయితే 111 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గుప్టిల్‌ తర్వాత వేగాన్ని పెంచుతూ వరుసగా బౌండరీలు కొట్టాడు. ఆఖరికి వేగంగా ఆడే ప్రయత్నంలో మార్టిన్‌ గుప్టిల్‌ (138; 139 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) తిసారా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అనంతరం దూకుడుగా ఆడుతున్న రాస్‌ టేలర్‌ కూడా 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో జేమ్స్‌ నీషమ్‌ అసాధారణ బ్యాటింగ్‌తో లంక బౌలర్లను హడలెత్తించాడు. ఇతను చవరి ఓవర్లో ఏకంగా 5 సికర్లు కొట్టి చుక్కలు చూపెట్టాడు. నీషమ్‌ కేవలం 13 బంతుల్లోనే 47 పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 371/7 పరుగులు చేసింది. లంక బౌలర్లలో లసిత్‌ మలింగా, నువాన్‌ ప్రదీప్‌, తిసారా పెరీరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించిన నీషమ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

DO YOU LIKE THIS ARTICLE?