తొలి రోజు బౌలర్లదే!

పెర్త్‌ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్‌లోని ఆక్టస్‌ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఇరుజట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. ఆరంభంలో గట్టిగా నిలబడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత తడబడింది. తిరిగి మళ్లీ నిలబడింది. భారత బౌలర్లు ఆరంభంలో విఫలమైనా, ఆ తర్వాత రాణించారు. మార్కస్‌ హారిస్‌ (70), ఆరాన్‌ ఫించ్‌ (50), ట్రేవిస్‌ హెడ్‌ (58), షాన్‌మార్ష్‌ (45)లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో హనుమ విహారీ, ఇషాంత్‌ శర్మలు రెండేసి వికెట్లు తీసుకోగా, బుమ్రా, ఉమేష్‌యాదవ్‌లు చెరొక వికెట్టు తీసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?