తొలకరి పిలిచింది!

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ : భారత్‌లో వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇవి నాలుగు నెలలపాటు కొనసాగనున్నాయి. ముందుగా చెప్పినట్టుగా జూన్‌ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతవరణశాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తరభారత దేశంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షం కురిసే అవకాశాలుండగా, మధ్యభారతం, దక్షిణ పెనిన్సులాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతవరణ శాఖ అధికారులు చెప్పారు. అదే విధంగా తూర్పు, ఈశాన్య భారతంలో దేశంలోని ఇతర ప్రాంతాలకంటే తక్కువగా వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, నాలుగు నెలలపాటు కొనసాగే వర్షాకాలం ప్రారంభమైందనడానికి సూచికంగా సో మవారం నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని భారత వాతావరణశాఖ డైరక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. జూన్‌ నుం చి సెప్టెంబర్‌ వరకు ఈ రుతుపవనాలు ప్రభావం ఉంటుందని, ఈ నాలుగు నెలల కాలంలో దేశంలో 75 శాతం వర్షపాతం నమోదవుతుందన్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమేట్‌ మే 30వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళకు ప్రవేశించినట్లు వెల్లడించగా, భారత వాతావరణశాఖ విభేదించింది.
అరేబియా సముద్రంలో అల్పపీడనం
దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. అరేబియా సముద్రం లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపానుగా మారనుందని తెలిపిం ది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మీదుగా అల్పపీడనం జూన్‌ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్‌ మహారాష్ట్రను దాటే క్రమం లో ముంబయి నగరంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండి తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉదయం నాటికి ప్రారంభంలో దాదాపు ఉత్తరంవైపునకు తుపాను కదిలే అవకాశముందని, ఆ తరువాత ఉత్తర మళ్లి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ తీర ప్రాంతం, హరిహరేశ్వర్‌ మధ్య తీరం దాటుతుందని తెలిపింది. ఇక ముంబయికి 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ఈ తుపాన్‌ గంటకు 105 నుంచి 110 కిలో మీటర్ల వేగంగా కదులుతోందని, జూన్‌ 3న సాయంత్రానికి తీరం దాటుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?