తెలంగాణ ప్రభుత్వమే ఉల్లంఘించింది

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఎపి సర్కారు ఫిర్యాదు
ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం కృష్ణానదీ యాజమన్యా బోర్డు (కెఆర్‌ఎంబి)కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని కృష్ణానదీ యాజమాన్య బోర్డు అధికారులతో ఎపి నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌తో మరో ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం కెఆర్‌ఎంబి చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో సమావేశమయ్యారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు అంశంలో ఎపి ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ఎపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కెఆర్‌ఎంబి తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జీవో 203 జారీకి సంబంధించి ఎపి అధికారులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అంశాల వారీగా వివరించినట్టు తెలిసింది. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లను సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరిందని, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్‌లను సమర్పించలేదని ఎపి నీటిపారుదల శాఖ కెఆర్‌ఎంబి చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రాజెక్టులకు అనుమతినిచ్చారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల వారిగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల వివరాలను ఎపి అధికారులు కెఆర్‌ఎంబి చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. వాటాలకు మించి తెలంగాణ సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. నీళ్ల గురించి, కెసిఆర్‌ గురించి ప్రతిపక్షాలు మాట్లాడడం పరువు తీసుకోవడమేనన్నారు. ఆంధ్ర సిఎం సంచులు మోసిన వారు ఎవరో తెలుసునన్నారు. పాలమూరు ఎత్తిపోతల సుప్రీం కోర్టులో కేసు వేశారని, ఆర్డర్‌ ఇచ్చారని, ఆపెక్స్‌ కమిటీ పో మ్మటే పోయామని, చట్టం పరిధిలో తమ ప్రజలకు న్యాయం చేసేందుకు క ట్టుబడి ఉన్నామని, ఉల్లంఘించలేదని, వివాదాలకు పోదల్చుకోలేదని, ధై ర్యం ఉండే వ్యక్తిని అన్నారు. ప్రతిపక్షాల గురించి పట్టించుకోవద్దని ప్రజలు చెబుతున్నారన్నారు. బేసిన్లు లేవని, బేషజాలు లేవని ఇరు రాష్ట్రాలకు సరిపో ను నీటి లభ్యత నదుల్లో ఉందన్నారు. చంద్రబాబు బాబ్లీ పంచాయతీ పెట్టి ఏమి సాధించారని, కృష్ణాలో ఒక టిఎంసి కోసం బస్తీమే సవాల్‌ అని వివాదా లు తెచ్చుకున్నారరని, నేడు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా వారికి చెప్పి మహారాష్ట్ర నుండి నీటిని తీసుకొచ్చామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. రాయలసీమకు నీరు గోదావరి నుండి మిగులు జలాలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఆగబోమని, వ్వరితో రాజీ పడే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. గోదావరి జలాలు ఎక్కడికి తీసుకెళ్లినా తమకు అభ్యంతంర లేదని చెప్పారు. తమకు రెండు నాల్కలు లేవని, తమను దెబ్బకొట్టే పద్ధతిలో ఉంటే తప్పకుండా నిరసన తెలుపుతామన్నారు. గోదావరిలో నిపుణుల కమిటీ తమ వాటా పోను 650 మిగులు జలాలు కావాలని అడుతున్నామన్నారు. తాగు , సాగు నీటి విషయంలో పొరుగు రాష్ట్రాలతో కలిసే పనిచేస్తున్నామని, వివాదా లే లేవని, అన్యోన్యంగా ఉన్నామని, దీంతో కొందరి కండ్లు మండుతున్నాయన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?