తెలంగాణకు వెయ్యి వెంటిలేటర్లివ్వండి  

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి ఈటల రాజేందర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి వెంటిలేటర్లు కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్‌ను ఫోన్‌లో కోరినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కేంద్రానికి మూడు విజ్ఙప్తులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వెయ్యి వెంటిలేటర్లను వెంటనే అందజేయాలని ఆయన కోరినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలిలో టిమ్స్‌ 1500 పడకల ఆసుపత్రి ప్రారంభమైంది కాబట్టి వెంటిలేటర్ల అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే పిపిఇ కిట్స్‌, ఎన్‌95 మాస్క్‌లు హెచ్‌సిఎల్‌ నుండి అందిస్తామని కేంద్రం తెలిపిందని, కానీ కేంద్రం నుండి తగినంత కిట్స్‌, మాస్రులు అందడంలేదని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చొరవ తీసుకొని వెంటనే ఎక్కువ మొత్తంలో వీటిని అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పిపిఇ కిట్స్‌, మాస్కులను పెద్ద ఎత్తున సేకరిస్తున్నప్పటికీ ఎక్కువ ధరకు కొనవలసి వస్తుందని చెప్పారు. కేంద్రం వీటిని అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని మంత్రి ఈటల తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?