తెలంగాణకు త్వరలోకేంద్ర వైద్య బృందాలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 15 రాష్ట్రాలకు కేంద్ర వైద్య బృందాలు రానున్నాయి. దేశంలోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు బృందాలను నియమించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో 7, తెలంగాణ 4, తమిళనాడు 7, రాజస్థాన్‌ 5, అస్సాం 6, హర్యానా 4, గుజరాత్‌ 3, కర్ణాటక 3, ఢిల్లీ 3, ఉత్తరాఖండ్‌ 3, బీహార్‌ 4, మధ్యప్రదేశ్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 3, ఉత్తరప్రదేశ్‌ 4, ఒడిశా 5 జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలను నియమించినట్లు తెలియజేసింది. ఒక్కో బృందంలో ప్రజారోగ్య నిపుణులు, ఎపిడెమియాలజీస్టులు, వైద్యులు, సీనియర్‌ జాయింట్‌ సెక్రటరీ స్థాయి నోడల్‌ అధికారులతో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ బృందాలు నగరాలలోని కేసుల నియంత్రణ చర్యలు, సమర్థవంతమైన చికిత్స నిర్వహణలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు తోడ్పడటానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను సందర్శిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?