తాగునీటికి తంటాలు!

గతేడాది కంటే గణనీయంగా పడిపోయిన నీటిమట్టాలు
నిజాంసాగర్‌లో కనిపిస్తున్నది బురదే
ఖాళీ అయిన సింగూరు
కనిష్ఠ స్థాయికి చేరుకున్న శ్రీరాంసాగర్‌
మరో 15టిఎంసిల దూరంలో నాగార్జున సాగర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా వేసవిలో సాగునీటికి అంతగా సహకరించకు న్నా… తాగునీటి కష్టాలను నీటిపారుదల ప్రాజెక్టులు తీరుస్తున్నా యి. ఈసారి నీటి పారుదల ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి చూస్తే తా గునీటి అవసరాలను కూడా తీర్చలేవేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎండలు ముదరకముందే ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. నిజాంసాగర్‌లో ప్రాజెక్టులో నైతే బురద మాత్రమే కనిపిస్తోంది. దీని పూర్తిస్థాయి నీటి నిల్వ 17.8టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 5.91 టిఎంసిల నీరు ఉంది. ప్రస్తుతం కేవలం 0.64 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. అంటే పశువులు నీరు తాగడానికి కూడా వీలులేని పరిస్థితి. మరో ప్రధాన ప్రాజెక్టు సింగూరుది ఇదే పరిస్థితి. దీని పూర్తి స్థాయి నీటి నిల్వ 29.31 టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 10.40 టిఎంసిలు కాగా ప్రస్తుతం కేవలం 1.17టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఎండ లు ముదరకముందే ఏకంగా 9 టిఎంసిల నీరు తగ్గింది. దీని ప్రభావం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నీటి అవసరాలపై పడుతుంది.ఈ రెండు ప్రాజెక్టులే కాదు గోదావరి, కృష్ణా బేసిన్‌లలోని ప్రాజెక్టులన్నింటి పరిస్థితి ఇదే విధంగా ఉంది. సాగు, తాగునీటికి ప్రధానాధారమైన శ్రీశైలం ప్రాజెక్టులోనైతే రోజురోజుకు గణనీయంగా నీరు తగ్గిపోతోంది. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతమే దాని కనిష్ట నీటి మట్టం కన్నా కేవలం 15 టిఎంసిల నీరు మాత్రమే అదనంగా ఉంది. ఆగస్టు నెలలో కాని ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. అంటే అయిదు నెలల పాటు ఇప్పుడున్న నీటితోనే నెట్టుకుపోవాలి. తెలంగాణలోని ప్రధాన రిజర్వాయర్లలో ఒకటైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుది అదే పరిస్థితి. ఈ ప్రాజెక్టు నుంచి రబీ కోసం నీటిని విడుదల చేయడంతో నీటినిల్వలు దారుణంగా పడిపోయాయి, దీని పూర్తిస్థాయి నీటినిల్వ 90టిఎంసిలు కాగా ప్రస్తు తం ఇందులో ప్రస్తు తం కేవలం 13.06 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 15.42 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి.ఇంకను రబీ అవసరాల కోసం మరో 6,800 క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సి ఉంది. ఎల్‌ఎండి నీటి నిల్వ 24.07 టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 6.62 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం 6 టిఎంసిలు ఉంది. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ 7.60 టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 3.46 టిఎంసిలు కాగా ప్రస్తుతం 2.80 టిఎంసీలు మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ 20.18 టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 11.54 టిఎంసిలు కాగా ప్రస్తుతం 11 టిఎంసిలు ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?