డేటా చోరీ కేసులో ఎవరినీ వదిలిపెట్టం

అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా అశోక్‌ను పట్టుకుని తీరతాం
సర్వర్‌లలో తెలంగాణ పౌరుల డేటాను గుర్తించాం
రాజకీయ ఆరోపణలతో సిట్‌కు సంబంధం లేదు
ప్రజల రక్షణకే పోలీసులు
తెలంగాణ సిట్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్ర
ఐటి గ్రిడ్‌ వ్యవహారంపై సిట్‌ వేసిన ఎపి ప్రభుత్వం

ప్రజాపక్షం/సిటీబ్యూరో : ఐటి గ్రిడ్‌ సంస్థ సిఇఒ అమరావతిలో ఉన్నా అ మెరికాలో ఉన్నా పట్టుకుని తీరతామని డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన అంశమని దోషులు ఎవరైనా తప్పక కోర్టు ముందు నిలబెడతామన్నారు. తెలంగాణ పౌ రు లకు సంబంధించిన డేటా కూడా ఐటి గ్రిడ్‌ సర్వర్‌లలో నిక్షిప్తమైనట్లు గుర్తించామన్నారు. ఐటి గ్రిడ్‌ సంస్ధ (డేటా చోరీ) కేసు పురోగతిని తెలిపేందుకు గురువారం రాష్ట్ర డిజిపి కార్యాలయంలో సిట్‌ అధికారులు మీడియా సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిట్‌ అధికారులు స్టీఫెన్‌ రవీంద్ర, శ్వేతారెడ్డి, రోహి ణి ప్రియదర్శినిలు పాల్గొని వివరాలు వెల్లడించారు. స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ సైబరాబా ద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్‌ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ గురువారం నుంచే తమ పనిని ప్రారంభిందన్నారు. ప్రాథమికంగా ఇరు కమిషనరేట్‌ల అధికారులతో చర్చించి కేసు పూర్వాపరాలు తెలుసుకున్నామన్నారు. మరో రెండు రోజులలో కేసులో వీలైనంత పురోగతి సాధిస్తామని ఆశాభా వం వ్యక్త పరిచారు. కేసు పరిశోదనలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణు ల అవసరం చాల ఉందని అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పా టు చేసిందని అన్నారు. ఈ బృందంలో ముగ్గురు ఐపిఎస్‌ అధికారులతో పాటు నలుగురు డిఎస్‌పిలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు ఉన్నారని వివరించా రు.వీరంతా వివిధ కేసుల దర్యాప్తులో నైపుణ్యత ప్రదర్శించిన వారని సాం కేతిక పరిజ్ఞానం పై కూడా పూర్తి స్ధాయి అవగాహన కల్గిన వారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?