ట్రంప్‌కు అభిశంసన?

కానీ సెనేట్‌లో విచారణ 100 రోజులు ఆలస్యం!
ఈ లోపు బైడెన్‌ ఇల్లు చక్కబెట్టుకుంటారు : డెమోక్రాట్ల అంచనా
రిచర్డ్‌ నిక్సన్‌ వాటర్‌గేట్‌ ఉదంతాన్ని ఉటంకించిన నాన్సీ పెలోసీ
వాషింగ్టన్‌ : మరో ఎనిమిది రోజుల్లో అధికార నివాసం వీడి వెళ్ళిపోవాల్సిన అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌కు అభిశంసన తీర్మాన పరాభవం తప్పేట్టు లేదు. ఈ విషయంలో సూందర్నీ ఒకచోట చేర్చేందుకు హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కీలకపాత్ర వహిస్తున్నారు. 2019లో ఒకసారి అభిశంసన తీర్మానం గెలవకుండా ఆయన తప్పించుకున్నప్పటికీ, ఈసారి సొంతపార్టీలోని రిపబ్లికన్‌ సభ్యులే ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. ట్రంప్‌ ప్రజాస్వామ్యానికి పెద్ద బెడదగా తయారయ్యారని నాన్సీ పెలోసీ విమర్శిస్తూ, ట్రంప్‌పై అభిశంసన తీర్మానంతో సభ ముందుకు సాగుతుందని అన్నారు. ట్రంప్‌ను సాగనంపేందుకు పద్ధతి ప్రకారం రాజ్యాంగంలోని 25వ ప్రకరణను అమలుచేసే బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షుడు పెన్స్‌పై నాన్సీ పెలోసీ ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు తన సహచర సభ్యులకు పెలోసీ ఆదివారంనాడు ఒక లేఖ రాశారు. సభ మొదట ట్రంప్‌ను సాగనంపేందుకు ఓటింగ్‌ చెయ్యాలని ఆమె లేఖ రాసిన ఒక రోజు తర్వాత సభ ఆ ప్రక్రియ ప్రారంభిస్తుందని, అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న దేశాధ్యక్షుడు ట్రంప్‌ తప్ప మరొకరు లేరని పెలోసీ అన్నారు. ఆదివారంనాడు గంటసేపు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పెలోసీ, గత కాలపు వాటర్‌గేట్‌ కుంభకోణాన్ని ఉటంకిస్తూ ఆ సమయంలో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌కు ’ఇక కథ ముగిసింది’ అని సెనేట్‌లో ఆయన పార్టీ సభ్యులే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే తక్షణం ఈ చర్యలు చేపట్టకతప్పదు, ఎందుకంటే ట్రంప్‌ ఈ రెంటికీ పెద్ద బెడదగా మారాడు అన్నారు. పెలోసీ నాయకత్వానగల బృందం పెన్స్‌ను, మంత్రివర్గ అధికారులను కలిసి 25వ అధికరణను అమలు చెయ్యాలని విజ్ఞప్తి చేస్తారు. ఒకవేళ సభను సమావేశపరచడానికి ఎలాంటి అభ్యంతరాలైనా ఉన్నట్లయితే మంగళవారంనాడు పెలోసీయే ఈ తీర్మానాన్ని సభముందుంచుతారు. ఒకవేళ బిల్లును ఆ మోదించేట్టయితే, తర్వాత 24 గంటలు ముందుగానే పెన్స్‌, మంత్రివర్గం సభ ముందు అభిశంసన తీర్మానం సిద్ధంగా ఉంచాలి. తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ, ఈ అభిశంసన విచారణ సెనేట్‌లో 100 రోజులు ఆలస్యం అవుతుంది. ఈ లోపు జో బైడెన్‌ అధికారం చేపట్టగానే ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. హౌస్‌ డెమోక్రాట్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. డెమోక్రాట్‌సభ్యుడు జిమ్‌ క్లుబర్న్‌ ఇదే అబిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్‌ పార్టీకి చెందిన రిపబ్లికన్‌ సెనేటర్లు పాత్‌ టూమీ (పెన్సిల్వేనియా), లిస ముర్కౌస్కీ (అలాస్కా) కూడా ట్రంప్‌ రాజీనామా చెయ్యాల్సిందే అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?