టిఆర్‌ఎస్‌లోకి సునీతాలక్ష్మారెడ్డి?

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఏప్రిల్‌ 3న నర్సాపూర్‌లో జరిగే ఎన్నికల ప్రచారసభలో ఆమె టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట సునీత బిజెపిలో చేరుతారానే ప్రచారం జరిగింది. గత కొంత కాలంగా పార్టీ మారుతారనే ప్రచారం జరిగినప్పటికీ సునీతాలక్ష్మారెడ్డి తాను పార్టీ మారడం లేదని ఖండించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె తమ అనుచరుల తో టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌ : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, నల్లగొండ డిసిసి అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ భిక్షమయ్యగౌడ్‌, టిపిసిసి ప్రధాన కార్యదర్శి  పల్లె లక్ష్మణ్‌కుమార్‌గౌడ్‌లను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. వీరిలో ఇప్పటికే భిక్షమయ్యగౌడ్‌, పల్లె లక్ష్మణ్‌గౌడ్‌ టిఆర్‌ఎస్‌లో చేరగా, సునీతా లక్ష్మారెడ్డి త్వరలో చేరనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?