టాప్‌లోనే మంధనా..

ఐసిసి ఉమెన్స్‌ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్‌: భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధనా తన టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. సోమవా రం ఐసిసి విడుదల చేసిన మహిళల వన్డే తాజా ర్యాంకింగ్స్‌లో మంధనా (744) రేటింగ్‌ పాయింట్లతో తన అగ్ర స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మంధనా విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. మరోవైపు భారత సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌, వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తన ఐదో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నది. ఇక దీప్తి శర్మ ఒక స్థానాన్ని ఎగబాకి 17వ ర్యాంక్‌ను అందుకుంది. వరుసగా విఫలమవుతున్న టి20 సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 19వ ర్యాంక్‌తో టాప్‌ 20లో చోటు దక్కించుకుంది. ఓవరాల్‌గా మంధనా తర్వాత ఆస్ట్రేలియా క్రీడాకారిణీలు పెర్రీ, మేగ్‌ లాన్నింగ్‌ వరుసగా రెండు, మూ డు స్థానాల్లో నిలిచారు. మిథాలీ కంటే ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆమీ సాటర్ట్‌వైట్‌ నాలుగో స్థానం ఉంది. బౌలింగ్‌లో ఝులన్‌ గో స్వామి మూడో ర్యాంక్‌లో నిలవగా.. మేఘన్‌ స్క్‌ట్‌ (ఆస్ట్రేలియా), సనా మీర్‌ (పాకిస్థాన్‌) వరుసగా టాప్‌ టూ ప్లేస్‌లలో ఉన్నారు. దీప్తి శర్మ ఎనిమిదో స్థానం దక్కించుకోగా.. పూనమ్‌ యాదవ్‌ తొమ్మిదో ర్యాంక్‌తో టాప్‌ 10లో చోటు సాధించారు.

DO YOU LIKE THIS ARTICLE?