జీవన జన్యు ఛేదన!

ఆక్లాండ్‌ : భూమిపై జీవనం ఎలా ప్రారంభమైందన్న విషయంపై జన్యుశాస్త్రంలో రహస్యంగా ఉం చిన నియమాలను పరిశోధకులు బయటపెట్టారు. అన్ని జీవులు జన్యుపరమైన సంకేతం డిఎన్‌ఎ ఆ ధారిత జన్యు సమాచారాన్ని ప్రొటీన్లుగా అనువదించడానికి జెనిటిక్‌ కోడ్‌ను ఉపయోగిస్తాయి. జీవకణాలు పనిచేయడానికి ఈ ప్రొటీన్లు ప్రధానమైనవి. దాదాపు 4 బిలియన్‌ సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితం భూమిపై జీవితకాలంలో అ నువాద ప్రక్రియ సంక్లిష్టంగా ఎలా ఉద్భవించిందో తెలిసింది. అయితే, ఈ సిద్ధాంతాన్ని పరిష్కరించడంలో ఇద్దరు సైద్ధాంతిక జీవశాస్త్రవేత్తలు గణనీయమైన పురోభివృద్ధిని సాధించారు. ఈ మిస్టరీని వారిద్దరూ ఛేదించారు. యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌లో బయోకెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పీటర్‌ విల్స్‌, యుఎన్‌సి స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ చార్లెస్‌ కార్టర్‌లు జీవకణాల డిఎన్‌ఎను ఛేదించడానికి అధునాతన అనువాద పద్ధతులను ఉపయోగించారు. వారి పరిశోధన న్యూక్లిక్‌ యాసిడ్స్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. 60 ఏళ్లుగా పరిష్కారం కాని జెనిటిక్‌ కోడింగ్‌ చరిత్రలో దాగివున్న కొన్ని నియమాలను వారు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?