జర్నలిస్టు పల్లవి కామెంట్స్ అసంబద్ధం

– ఆమె వ్యాఖ్యలను ఖండించిన ఎం.జె అక్బర్ దంపతులు

న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జర్నలిస్టు పల్లవి గోగొయ్ మాజీ కేంద్ర మంత్రి ఎం.జె అక్బర్ చేసిన అత్యాచార ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయంలో ఎం.జె అక్బర్ ఆయన భార్య మల్లికా అక్బర్ బాసటగా నిలిచారు. పల్లవి చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. శుక్రవారం దంపతులిద్దరూ వేర్వేరుగా మాట్లాడుతూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎం.జె అక్బర్ వాషింగ్టన్ పోస్టులో వచ్చిన కథనంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. 1994లో పల్లవితో తను పలు నెలల పాటు స్నేహం కొనసాగించినట్లు చెప్పిన దాంట్లో ఎలాంటీ వాస్తవం లేదని అక్బర్ పేర్కొన్నారు. ఈ అంశం తెరపైకి వచ్చిన నుంచి తమ కుటుంబానికి చికాకు కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “పల్లవి ఎందుకు అబద్దం చెబుతుందో నాకు తెలియదు” కానీ, ఆమె చెబుతున్నది మాత్రం పచ్చి అబద్ధమని అక్బర్ భార్య మల్లికా అక్బర్ తెలిపారు. ఇక కేంద్ర మంత్రి అక్బర్ మీటూ ఉద్యమంలో భాగంగా ఆయనపై పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక పల్లవి కూడా అక్బర్ తనను లైంగిక వేధించాడని చేసిన కామెంట్స్ శుక్రవారం వాషింగ్టన్ పోస్టు కథనంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యాఖ్యలను అక్బర్ దంపతులిద్దరూ ఖండించారు.

DO YOU LIKE THIS ARTICLE?