చైనా వస్తువులపై తలో మాట ఎందుకు?

ప్రజాపక్షం / హైదరాబాద్‌: ఇస్రో ప్రైవేటీకరణ నిర్ణయా న్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ కేంద్ర ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కరోనా వైరస్‌తో ఇబ్బందు లు, కష్టాలు పడుతున్న ప్రజలను గాలికి వదిలి, కార్పోరేట్‌ సంస్థలకు అనుకూలంగా బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించింది. కరోనా వైరస్‌ కట్టడి, ప్రజలకు సహాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ తెలిపింది. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం జూమ్‌ యా ప్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ కె.నారాయ ణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా ప రిపాలన అందిస్తామన్న బిజెపి, అధికారంలోకి రాగానే పంచభూతాలను అమ్మెస్తోందని, భక్తి పేరుతో దేశాన్ని అమ్ముతుందని విమర్శించారు. అనంతమైన లాభాలు తెచ్చిపెట్టే, అందరికీ ఉపయోగపడే ఇస్రో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు దేశ భక్తులు, మేథావులు, రాజకీయ పా ర్టీలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నా రు. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నదని, ఇస్రో ప్రైవేటీకరణను చేయవద్దని, దక్షిణభారతదేశంలో ఉన్న ఈ సంస్థ జోలికి పోవద్దని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి లేఖ రాయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ పెంపు పేరుతో ప్రజలను దోపిడీ చేసి ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారన్నారని విమర్శించారు, చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాద ని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటిస్తే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం వస్తువులను నిషేధించాలని చెబుతున్నారని, చైనా వస్తువుల విషయంలో ఒక్కోక్కరు ఒక్కోలా మాట్లాడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని చెప్పా రు. నిజంగానే చైనా వస్తువులను నిషేధించాలని కిషన్‌రెడ్డి భావిస్తే అదే డిమాండ్‌తో ఆయన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాలని నారాయణ సూచించారు. చైనా వస్తువుల బహిష్కరణపై తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని, అయితే దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ధ్వంసం చేశారన్నారు. మద్యం, సార అమ్మకాలపై ఆర్‌ఎస్‌ఎస్‌కు అంత ప్రేమ ఉన్నదా? అందుకే వాటిని తెరిచారా అని ఆయన ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం ‘రైట్‌ టైమ్‌లో రాంగ్‌ డెసిషన్‌’ తీసుకున్నారని పేర్కొన్నారు.
హరితహారం మోజులో పాలకులు
ప్రజలు కరోనాతో భయపడుతుంటే పాలకులు మాత్రం హరితహారం మోజులో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పాలకులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు. హుస్నాబాద్‌లో నాలుగువేల మొక్కలు పడేశారన్నారు. కరోనా పాజిటివ్‌ సంఖ్య హద్దులు మిరి అదుపుతప్పుతున్నప్పటికీ సిఎం కెసిఆర్‌ పట్టించుకోవడం లేదని, అందుకే వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే హైదరాబాద్‌లో లా క్‌డౌన్‌ విధించే విషయమై ప్రభుత్వం ఆలోచన సూచించారు. కరోనా నేపథ్యంలో అవసరమైన వైద్యులను నియమించాలని, లేదా ప్రైవేటు వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రాలకు సహాయం చేయకుండా ఫెడరలిజానికి భిన్నం గా వ్యవహారిస్తోందని, అదే సమయంలో రాష్ట్ర ప్రభు త్వం ప్రజలకు సహాయం చేసే చర్యలు కూడా అమలు చే యడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు నాలు గు నెలలుగా ప్రజలు దుర్బర జీవితనాన్ని గుడుపుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజండాను అమలు చేసేందుకు సరళీకరణ విధానాన్ని అవలభింస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తుందని, సహజవనరులను, దేశ సంపదను కార్పోరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ద్వజమెత్తారు. కరోనా పేరుతో ప్రజాఉద్యమాలకు బ్రేకులు వేసి, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను హ రించివేస్తున్నారన్నారు. చమురు కంపెనీలకు కేంద్ర ప్ర భుత్వం వత్తాసు పలుకుతోందని, వారి చేతిలో కేంద్రం కీ లుబొమ్మగా మారిందని చాడ విమర్శించారు.
ధరల పెంపులో మనదే ‘గిన్నిస్‌’ రికార్డ్‌ : రామకృష్ణ
ప్రపంచలో ఎప్పుడు, ఎక్కడా లేని విధంగా మనదేశంలో నే ఇరవై రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పె రగడం గిన్నిస్‌ రికార్డ్‌కు ఎక్కుతుందేమోనని సిపిఐ ఆం ధ్రప్రదేశ్‌ కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతుననప్పటికీ దేశం లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతుండ డం వి డ్డూరంగా ఉందన్నారు. పెరుగుతున్న ధరలను ని రసి స్తూ పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈ నెల 30న చేపట్టనున్నట్టు ఆయన చె ప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచి న వ్యాట్‌ ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ర ంగ సంస్థ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, ప్ర తి ఒక్కరూ సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలన్నా రు. ప్రజలను కరోనాకు వదలిపెట్టి, తమ ఏజెండాను ప్ర జలపై బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారించలేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?