చెరువులోకి తోసి…

ఇద్దరు పిల్లలను కడతేర్చిన కసాయి తల్లి
ప్రియుడి మోజుతోనే పిల్లలను చంపిందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో : నవమాసాలు మోసి ఇద్దరు బిడ్డలకు జన్మనించి, పదెళ్ళగా ఎంతో అపురూపంగా పెంచుకుంటూ వస్తున్న ఓ కన్న తల్లి ఒక్కసారిగా కసాయిగా మారింది. అమ్మ తనాన్ని మరిచి యావత్‌ సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. భార్యాభర్తల మధ్య ఉన్న తగువునో లేక మరో కారణమో తెలియదు కానీ తన పిల్లలను చెరువులో తోసేసి వారి చావుకు కారణమైంది. ఈ హృదయ విధారక ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. తన పిల్లలను చంపడానికి కారణం ప్రియుడి మోజుతోనే అంటూ భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెం గ్రామానికి చెంది న నాగమణి (రజక) హైదరాబాద్‌కు చెందిన తాయి ప్రశాంత్‌కుమార్‌(వెలమ) 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రైవేట్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. భార్య నాగమణి కూతురు జ్యోతి మధవి(11), కుమారుడు హర్షవర్ధన్‌(09)తో కలిసి సోమవారం తెల్లవారుజామున తమ ఇంటి నుండి సద్దల చెరువు మినీ ట్యాంక్‌బండపైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. తమ ఇద్దరు పిల్లలను చెరువు నీటిలో తోసిన నాగమణి ఆమె మాత్రం ఆత్మహత్య చేసుకోలే దు. ఉదయం 5గంటలకు ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌కు వచ్చిన కొందరు వ్య క్తులు అక్కడ సంచరిస్తున్న ఆమెను ప్రశ్నించగా తన పిల్లలు చెరువులో పడి మృతి చెందారని తన బాబును అందులో నుండి ఒడ్డుకు తీసేలోపే మృతి చెందాడని చెప్పినట్లు ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు. పాప నీటిలో మునిగిందని ఆమె ఆచుకీ తెలియక ఇక్కడ తిరుగుతున్నట్లు చెప్పడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. చెరువు వద్దకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండడం గమనించి తిన్నగా అక్కడి నుండి ఓ ఆటోలో జారుకుంది. ఘట న స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళ సహాయంతో చెరువులో నుండి పాప మృతదేహాన్ని కూడా ఒడ్డుకు తీశారు. ఈ రెండు మృతదేహాల ను సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రి మార్చరికీ తరలించారు. ఇదిలా ఉండ గా, ప్రియుడి మోజుతోనే తన ఇద్దరి పిల్లలను చంపిందంటూ నాగమణి భర్త ప్రశాంత్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వృత్తిరీత్యా ప్రై వేట్‌ కారు డ్రైవర్‌ను కావడంతో డ్యూటీ మీద బయటకు వెళ్తుండడంతో మ రో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఇది పిల్లలు చూసి తనకు చెబుతుండడంతోనే వారిని అడ్డుతొలగించుకునేందు కు ఇలా చేసిందని పోలీసులకు తెలిపారు. కాగా నాగమణి మాత్రం తన భర్త తాగుడికి బానిసై నిత్యం అనుమానంతో తనను వేధించడంతో పాటు పిల్లలను, తనను కోడుతుండడంతో భరించలేక ఆత్మహత్య చేసుకునేందు కు తాను సోమవారం తెల్లవారుజామున సద్దల చెరువు వద్దకు వచ్చామని వాదిస్తుంది. ఈ క్రమంలో పిల్లలను అందులో తోసివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోబోయానని చెబుతుంది. చెరువులో పడ్డ పిల్లలు మృతి చెంద గా నాగమణి మాత్రం ఏలా బయటకు వచ్చిందన్నది మిస్టరీగా మారింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు వచ్చిన నాగమణిని భర్త, బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదును అందుకు న్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయమై పట్టణ ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులు మాట్లాడుతూ పిల్లల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై తాము విచారణ చేస్తున్నామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?