చెన్నారెడ్డి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం

మర్రి చెన్నారెడ్డి శతజయంతి కార్యక్రమంలో వక్తలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌/ ముషీరాబాద్‌
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వ్యక్తిత్వం గొప్పదని, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకం రావాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మర్రి చెన్నారెడ్డి మెమోరియల్‌ రాక్‌ గార్డెన్‌లో ఆదివారం మర్రి చెన్నారెడ్డి శత జయంతి జరిగింది. మాజీ గవర్నర్‌ కె. రోశయ్య, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టిపిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, మాజీ సిఎం నాదేండ్ల భాస్కర్‌రావు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మ య్య, టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపిలు బం డారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, చెన్నారెడ్డి కుమారుడు, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌. సురేష్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎ.చక్రపాణి, ఎంఎల్‌సిలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర మాజీమంత్రులు డాక్టర్‌ జె.గీతారెడ్డి, డి.కె. సమరసింహరెడ్డి, జస్టిస్‌ సభాష్‌రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డితో (మొదటి పేజీ తరువాయి)
పాటు పలువురు రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని మర్రి చెన్నారెడ్డికి నివాళులుఅర్పించారు.
చెన్నారెడ్డితో పనిచేసే అదృష్టం దక్కింది : రోశయ్య
చెన్నారెడ్డితో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని మాజీ గవర్నర్‌ కొణిజెటి రోశయ్య అన్నారు. ఆయన అందరివాడని, ఇచ్చిన మాట తప్పే వారు కాదన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయంలో కూర్చోని చేయాల్సిన సంతకాలు కూడా సభలు,సమావేశాలకు వెళ్ళే క్రమంలో చేశావారని గుర్తు చేసుకున్నారు.ఆయన తెలంగాణ ప్రజా సమితికి చెన్నారెడ్డి అధ్యక్షునిగా పనిచేస్తే, మా అమ్మ ఈశ్వరీభాయి ఉపాధ్యక్షురాలుగా పనిచేసిందని డాక్టర్‌ జె.గీతారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతలకు చెన్నారెడ్డి మంచి గౌరవం ఇచ్చేవారన్నారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెన్నారెడ్డి జీవితాన్ని ఒక పుస్తక రూపంగా తీసుకురావాలని కోరారు. ఎస్‌. జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ చెన్నారెడ్డి జీవితం దేశానికే ఆదర్శమన్నారు. శాసన సభలో ప్రతిపక్షాల దాడినిసైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి ఒకరని అన్నారు. చెన్నారెడ్డి 1969లో తెలంగాణకు అన్యాయం చేశారన్నది సుద్దతప్పని, అపుడు గెలిచిన 10 మంది టిపిఎస్‌ ఎఁపీలలో 9మంది కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నందుకే అందరం ఐక్యం గా ఉందామని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి ప్రవేశపెట్టిన చట్టాలను తాను చదివి, వాటి ఆధారంగా తీర్పులు వెలువడించానని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా చెన్నారెడ్డి పోరాటం చేశారన్నారు. నీటిపారుదల కోసం వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి నిధులు తెచ్చిన వ్యక్తి చెన్నారెడ్డి అని చెప్పారు. ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మర్రి చెన్నా రెడ్డి పేరు మీద పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని, ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటుకు 1969 తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి అని చెప్పారు. గోదావరినది జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుకు చెన్నారెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి బీజం: చాడ
తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తాను మొదట తెలంగాణ ప్రజా సమితి తరపున ప్రచారం చేశానని, ఆ పార్టీ13 సీట్లలో పోటీ చేస్తే 10సీట్లు గెలిచిందని గుర్తు చే శారు.చెన్నారెడ్డి జీవితాన్ని పుస్తకం రూపంలో తీసుకురావాల ని అన్నారు.1969లో చెన్నారెడ్డి చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికితానుఆకర్షితుడినయ్యాననిఆయనగుర్తు చేశారు.
చెన్నారెడ్డి గొప్ప ఉద్యమకారుడు : నాయిని
మర్రిచెన్నారెడ్డి గొప్ప ఉద్యమకారుడని, తెలంగాణ ఉద్యమాన్ని ఆయన అణచివేయలేదని, వెన్నుపొటు పొడవలేదని మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచిన ఎంపిలు కాంగ్రెస్‌లో కలిశారని, ఆ సమయంలో నిస్సహాయుడై అందుకే తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని రోజులు నిలిపివేశారని గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర మరవలేనిదని చెప్పారు. తెలంగాణలో చెన్నారెడ్డి మొనగాడని, ఆయన తర్వాత అంతటి మొనగాడు కెసిఆర్‌ ఒక్కరేనని పేర్కొన్నారు. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి నది జలాలు సంపూర్ణంగా వినియోగించే పథకాన్ని చెన్నారెడ్డి రూపొందించారని గుర్తు చేశారు.
చెన్నారెడ్డి స్టేట్‌మెన్‌ : శ్రీనివాస్‌ రెడ్డి 
చెన్నారెడ్డి ఒక్క స్టేట్‌మెన్‌ అని, విజన్‌ ఉన్న నాయకుడని ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. చెన్నారెడ్డి ప్రజాస్వామ్యవాది అని,ప్రతిపక్షాన్ని గౌరవించే నేత అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి గవర్న ర్‌ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులకు జూబ్లీహిల్స్‌లో ఇండ్ల స్థలాల కోసం 25 ఎకరాల భూమిని కేటాయించిన ఘనత చెన్నారెడ్డికే దక్కుతుందని చెప్పారు.
మర్రిది ప్రజల భావాలను పసిగట్టేతత్వం : సోనియాగాంధీ
“ప్రజల భావాలను పసిగట్టడంలో మర్రి చెన్నారెడ్డి రాజకీయ జీవితం అందరికీ ప్రొత్సాహకం. ఆయన అనుభవం ప్రజల భావాలను పసిగట్టేతత్వం రాజకీయాలకతీతంగా అందరినీ ఆకుట్టుకుంటుంది” అని యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఒక సందేశంలో శ్లాఘించారు.

DO YOU LIKE THIS ARTICLE?