చికెన్‌ @ 240

పెరిగిన చికెన్‌ ధర!
మాంసం ప్రియులకు షాక్‌
గతంలో కరోనా దెబ్బకు పడిపోయిన చికెన్‌ ధర
ప్రస్తుతం రూ.200 నుంచి రూ.240 వరకు విక్రయం
ఉత్పత్తి తగ్గినందుకే డిమాండ్‌ పెరిగిందంటున్న వ్యాపారులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా దెబ్బకు గతంలో పడిపోయిన చికెన్‌ ధర… ఇప్పుడు చుక్కలనంటే దిశగా పరుగు లు పెడుతోంది. గత రెండు నెలల క్రితం రాష్ట్రంలో పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. చికెన్‌ తింటే కరోనా సోకుతుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చాలా మంది మాంసం ప్రియులు చికెన్‌ కొనుగోలు చేయడానికి జంకారు. ఈ  నేపథ్యంలో అప్పట్లో చికెన్‌ రేట్లు భాSరీగా పడిపోయాయి. సాధారణంగా 180- రూపాయిలు ఉండే కిలో చికెన్‌ ధర కేవలం 35 రూపాయిలు పలికింది. వందకు మూడు కిలోలు కూడా ఇచ్చారు. ఎంత తక్కువకు విక్రయించినా చికెన్‌ షాపులు మాత్రం అప్పట్లో వెలవెలబోయాయి. అసలు చికెన్‌ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పౌల్ట్రీ యజమానులు లబోదిబోమన్నారు. చికెన్‌ తింటే కరోనా సోకదనే భరోసాను వైద్యులు, ప్రభుత్వం కల్పించడంతో పరిస్థితి చక్కబడింది. పైగా చికెన్‌, గుడ్లు తింటే శరీరానికి ప్రొటీన్స్‌ లభిస్తాయని తెలుసుకొని జనాలు చికెన్‌ తినడానికి మళ్లీ అలవాటు పడ్డారు.  నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ ఇప్పుడు మొత్తం సీన్‌ మారిపోయింది. ఆదివారం మాత్రం చికెన్‌ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరోనా వైరస్‌ ప్రబలేందుకు చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదాని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే చికెన్‌ ఎక్కువగా తినాలి అని సిఎం స్వయంగా ప్రకటించడంతో ప్రజల్లో అపోహలు తొలగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కిలో చికెన్‌ ధర రూ.240 వరకు చేరింది. కొన్ని చోట్ల రూ.200 నుంచి రూ.220 మధ్య అమ్మకాలు జరిగాయి. మటన్‌ ధర 650 నుంచి 700 రూపాయల మధ్య ఉండేది. కానీ ఆదివారం రూ.800కి చేరింది. జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రేట్లు భారీగా పెంచేశారు. చేపల ధర కూడా కిలో రూ.110 నుంచి 150 వరకు పెంచేశారు. మాంసం ప్రియులకు ధరలు పెరిగినా కొనుగోలు చేస్తున్నారు. ధరల పెరుగుదలకు ముఖ్య కారణం డిమాండ్‌ పెరగడం అని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌ పెరిగి ఉత్పత్తి తగ్గిందని తెలుపుతున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఈ నేథ్యంలో కోళ్లకు దాణా దొరకని పరిస్థితి. దాంతో పౌల్ట్రీ పరిశ్రమ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. దాంతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే చికెన్‌ డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?