ఘోర రోడ్డు ప్రమాదం

లారీ- కారు ఢీ
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి- కడపకు వెళ్లే రహదారి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలి తీసుకుంది. ఈ రహదారిపై మామండూరు వద్ద శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొనడంతో కారులో ప్రయానిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. వీరంతా కడప జిల్లా సికె దిన్నెకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికె దిన్నెకు చెందిన గంగాధరం కువైట్‌ నుంచి శనివారం సాయంత్రం చెన్నై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. గంగాధరంకు స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అక్కడ నుంచి వారంతా కలిసి కారులో కడపకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే కడప వైపు నుంచి రేణిగుంట వైపు వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధరం(35), ఆయన భార్య విజయమ్మ(30), తమ్ముడు ప్రసన్న(32), మరదలు మరియమ్మ(25) ఏడాదిన్నర వయస్సున్న ప్రసన్న, మరియమ్మ కుమారుడు మృతిచెందారు. ఈ ఘటనాపై కేసు నమోదు చేసుకున్న రేణిగుంట పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?