గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌

అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం
మూడు యూనిట్లుగా నగరం
మూడు నెలల్లో బృహత్‌ ప్రణాళిక రూపొందించాలి
మాస్టర్‌ ప్లాన్‌లో మంత్రివర్గం కాకుండా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం
హైదరాబాద్‌నే కాకుండా చుట్టున్న పట్టణాలనూ అభివృద్ధి చేసేలా వ్యూహం
హెచ్‌ఎండిఎ, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో ప్రాధికార సంస్థ
ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు విస్తరణ
ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్‌
హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరాన్ని నిజమైన గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిం చి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నగరాలు అభివృద్ధి చెందుతున్నా కొద్దీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటి వాటిని ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలన్నారు. నగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తామని సిఎం ప్రకటించారు. ఒఆర్‌ఆర్‌ లోపలున్న నగరం, ఒఆర్‌ఆర్‌ అవతల నుంచి ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యనున్న నగ రం, ఆర్‌ఆర్‌ఆర్‌ అవతల విస్తరించే నగరం యూ నిట్లుగా హైదరాబాద్‌ మహానగరాన్ని భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఆస్కి అర్బన్‌ గవర్నెన్స్‌ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీరెడ్డి, సిఎంఒ కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, మాణిక్‌ రాజ్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు డి.ఎస్‌.రెడ్యానాయక్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?