గ్యాస్‌ మంటలు!

హైదరాబాద్‌లో రూ.16 పెరిగిన సిలిండర్‌ ధర
వెంటనే అమల్లోకి వస్తుందన్న చమురు కంపెనీలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతుంటే, సామా న్యుడిపై మరింత భారాన్ని మోపుతూ లిక్వి ఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పిజి) సిలిండర్‌ ధర కూడా పెరిగింది. 14.2 కిలోల బరు వున్న సబ్సిడీ సిలిండర్‌ ధరను 25.50 రూ పాయలు పెంచుతున్నట్టు చమురు కంపె నీలు ప్రకటించాయి. మరో వైపు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పైన కూడా చమురు కంపెనీలు ధరలను పెంచేశాయి. సిలిండర్‌ కు రూ.76 పెరిగినట్టు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. పెట్రో ధరలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవిని గ్యాస్‌ మంటలు చట్టుముట్టి మరింతగా వేధిస్తున్నాయి. తాజాగా పెంచిన రేటు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర ధర రూ.834.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,550గా ఉంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలింర్‌ ధర రూ.16 పెరిగింది. ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగడంతో అది రూ.1,768కు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను అనుసరించి చమురు కంపెనీలు ప్రతి ఐదు రోజులకు ఒకసారి రాజధానితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్‌పిజి సిలిండర్‌ ధరలను సవరించే అవకాశం ఉంటుంది. గత నెల వాణిజ్య సిలిండర్లపై 122 రూపాయలు తగ్గించిన చమురు కంపెనీలు తాజాగా మళ్లీ పెంచాయి. మొత్తం మీద గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఇప్పటికే కొవిడ్‌ కారణంగా ఆదాయన వనరులు దారుణంగా దెబ్బతిన్నాయి. పెట్రో ధరల పెరుగుతుండడంతో, వాటి ప్రభావంతో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే వంట గ్యాస్‌ ధర కూడా పెరగడం సామాన్యుడిపై మోయరాని బరువును మోపుతున్నది. ఈ భారం నుంచి ఊరట లభించేది ఎప్పుడన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.అవుతున్న సగటు జీవిని గ్యాస్‌ మంటలు చట్టుముట్టి మరింతగా వేధిస్తున్నాయి. తాజాగా పెంచిన రేటు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర ధర రూ.834.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,550గా ఉంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలింర్‌ ధర రూ.16 పెరిగింది. ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగడంతో అది రూ.1,768కు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను అనుసరించి చమురు కంపెనీలు ప్రతి ఐదు రోజులకు ఒకసారి రాజధానితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్‌పిజి సిలిండర్‌ ధరలను సవరించే అవకాశం ఉంటుంది. గత నెల వాణిజ్య సిలిండర్లపై 122 రూపాయలు తగ్గించిన చమురు కంపెనీలు తాజాగా మళ్లీ పెంచాయి. మొత్తం మీద గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఇప్పటికే కొవిడ్‌ కారణంగా ఆదాయన వనరులు దారుణంగా దెబ్బతిన్నాయి. పెట్రో ధరల పెరుగుతుండడంతో, వాటి ప్రభావంతో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే వంట గ్యాస్‌ ధర కూడా పెరగడం సామాన్యుడిపై మోయరాని బరువును మోపుతున్నది. ఈ భారం నుంచి ఊరట లభించేది ఎప్పుడన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

DO YOU LIKE THIS ARTICLE?