గేల్‌ విధ్వంసం..

చెలరేగిన థామస్‌.. ఆఖరి వన్డేలో ఇంగ్లాండ్‌ చిత్తు
సిరీస్‌ను 2-2తో సమం చేసిన విండీస్‌
సెయింట్‌ లూసియా: వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో గేల్‌ 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 77 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ముం దు బౌలింగ్‌లో ఒషానె థామస్‌ (5/21) చెలరేగి బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ (28.1 ఓవర్లలో) 113 పరుగుల కే కుప్పకూలింది. అనంతరం గేల్‌ వీరవిహారం చేయడం తో ఇంగ్లాండ్‌ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని విం డీస్‌ 12.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌లో గేల్‌, బౌలింగ్‌లో థామస్‌ చెలరేగడం తో ఐదో వన్డేలో విండీస్‌ 7 వికెట్లతో ఘన విజయం సా ధించింది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు వన్డే ల సిరీస్‌ 2-2తో సమం అయ్యింది.
ఇంగ్లాండ్‌ రెండు వన్డేల్లో విజయాలు సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవగా.. కీలకమైన ఆఖరి వన్డేలో విండీస్‌ గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో క్రిస్‌ గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా తన బ్యాటింగ్‌ పవర్‌ ఎంటో మరోసారి చూపెట్టాడు. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ (1) తక్కువ స్కో రుకే పెవిలియన్‌ చేరినా గేల్‌ మాత్రం దూకుడుగా ఆడు తూ ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఇతని సుడిగాలి ఇన్నింగ్స్‌కి మైదానమంత పరుగుల వరద పారింది. ఈ క్రమంలోనే గేల్‌ 19 బంతుల్లోనే హాఫ్‌ సెం చరీ సాధించి వెస్టిండీస్‌ తరఫున ఫాస్టెస్ట్‌ అర్ధ శతకం న మోదు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అనంతరం అదే జోరును కొనసాగించిన గేల్‌ చివరికి (77; 27 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మార్క్‌వుడ్‌ బౌ లింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత డారెన్‌ బ్రావో (7 నా టౌట్‌), హేట్‌మైర్‌ (11 నాటౌట్‌) అజేయంగా ఉండి కరీబియన్‌ జట్టును మరో 227 బంతులు మిగిలి ఉండగానే విజయతీరానికి చేర్చారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇం గ్లాండ్‌ ఒషానె థామస్‌ ధాటికి విలవిలలాడింది. నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన థామస్‌ ఇంగ్లాండ్‌ బ్యా ట్స్‌మెన్స్‌పై విరుచుకుపడ్డాడు. ఇతని ధాటికి ఇంగ్లాండ్‌ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతూ చివరికి 113 పరుగులకే ఆలౌటైపోయింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లో అలెక్స్‌హేల్స్‌ (23), జాస్‌ బట్లర్‌ (23) వీరిద్దరే ఇరవై పరుగుల మార్కును దాటగలిగారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్లయితే రెండంకెల స్కోరును కూడా దాటలేక పోయారు. చెలరేగి బౌలింగ్‌ చేసిన థామస్‌ 5 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్‌, బ్రాత్‌వైట్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. షెల్డన్‌ కాట్రెల్‌కి ఒక వికెట్‌ లభించింది. ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన థామస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ వన్డే సిరీస్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన క్రిస్‌ గేల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కైవసం చేసుకున్నాడు. తొలి వన్డేలో 3 ఫోర్లు, 12 సిక్సర్ల తో 135 పరుగులు చేసిన గేల్‌.. రెండో వన్డేలో 4 సిక్సర్లు, 1 ఫోర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. నాల్గో వన్డేలో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఒవరాల్‌గా విండీస్‌ సిరీస్‌ గెలవడం సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ గేల్‌ కీలక పాత్ర పోషించాడు. చాలా కాలం తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న గేల్‌ తన కసిని ప్రత్యర్థి బౌలర్లపై ప్రదర్శించాడు. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌గా మారనున్నాడు. గేల్‌ ఫామ్‌లో రావడంతో విండీస్‌ జట్టులో వరల్డ్‌కప్‌ ఆశలు చిగురుస్తున్నాయనడంలో సందేహంలేదు.

DO YOU LIKE THIS ARTICLE?