గంభీర్‌ ప్రపంచకప్‌ జట్టు ఇదే!

ఢిల్లీ : ప్రపంచకప్‌ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టును బీసిసిఐ నేడు ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఎవరికి చోటు లభిస్తుంది.. జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ ప్రపంచకప్‌ కోసం తన కలల జట్టును ప్రకటించాడు. అయితే గంభీర్‌ జట్టులో చాలా మంది పేర్లు ముందుగా ఊహించినవే అయిననప్పటికీ.. నం.4 స్థానానికి ఎంపిక మాత్రం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీమిండియాలో నం.4 స్థానంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్‌ ఆ స్థానానికి సంజూ శాంసన్‌ పేరును ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ స్థానంలో శాంసన్‌ సరిపోతడని గంభీర్‌ భావిస్తున్నాడు. ఇక ధోనీ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్‌ ప్రతినిథ్యం వహించాడు. గంభీర్‌ ప్రపంచకప్‌ జట్టులో ఎవరెవరూ ఉన్నారో ఓసారి చూస్దాం.
గంభీర్‌ ప్రపంచకప్‌ జట్టు : రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సంజూ శాంసన్‌, కేదార్‌ జాదవ్‌, నవదీప్‌ సైనీ, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, రవిచంధ్రన్‌ అశ్విన్‌, యాజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌.

DO YOU LIKE THIS ARTICLE?