క్షౌరశాలలు, మద్యం షాపులకుఅనుమతి

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో మాత్రమే
సడలింపులపై స్పష్టతనిచ్చిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు జిల్లాను మూడు జోన్లుగా విభజించిన కేంద్రం.. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో అనేక అంక్షలను ఎత్తివేసింది. జోన్‌లలో తా జాగా చేసిన సడలింపుల్లో మద్యం దుకాణా లు, ఇ క్షౌరశాలలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం శనివారం వాటిపై స్పష్టతనిచ్చింది. ఈనెల 4వ తేదీ నుంచి మొదలుకానున్న లాక్‌డౌన్‌ మూడో దశలో దేశవ్యాప్తంగా రెడ్‌జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టతనిచ్చింది. ఇ ప్లాట్‌ఫాంల ద్వారా నిత్యావసరాలుకాని వస్తువుల విక్రయాలకు పచ్చజెండా ఊపింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో ఇ ప్లాట్‌ఫాంల ద్వారా నిత్యావసరాలుకాని వస్తువుల విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవని హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెడ్‌ జోన్‌లలో కేవలం నిత్యావసర వస్తువులు విక్రయించేందుకు మాత్రమే ఇ కంపెనీలకు అనుమతి. క్షౌరశాలలు, సెలూన్లూ రవాణా సేవలు కానందున రెడ్‌ జోన్‌లలో వాటికి అనుమతి లేదు. గ్రీన్‌, ఆరెంజ్‌జోన్‌లలో అదే విధంగా కంటైన్మెట్‌ పరిధిలోకి రాని రెడ్‌జోన్‌లలో కూడా మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చారు. నాన్‌ కంటైన్‌ మెంట్‌ జోన్లలో మార్కెట్‌ కాంప్లెక్స్‌ లేదా మాల్‌లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. అదే వద్ద దుకాణం వద్ద ఐదుగురికంటే ఎక్కువ మంది ఉండకూడదు. ఈ సడలింపులన్నీ మూడవ దేశ లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యే ఈనెల 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలోని జిల్లాలను మూడు జోన్లుగా విభజిస్తూ శుక్రవారం కేంద్రం జాబితాను విడుదల చేసింది. 130 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండగా, 284 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. దేశ రాజధానిలోని అన్ని జిల్లాలూ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?