క్వార్టర్‌ ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌

కశ్యప్‌, ప్రణయ్‌ కూడా.. ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
ఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, పారుపల్లి కశ్యప్‌లు ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో మాజీ ఛాంపియన్‌, మూడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ 21 21 తేడాతో చైనాకు చెందిన లు గౌంగ్‌జును వరుస గేమ్‌లలో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన హైదరాబాదీ స్టార్‌ శ్రీకాంత్‌ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలి గేమ్‌ను 21 ఏకపక్షంగా గెలుచుకున్న శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లో మాత్రం చైనా ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. కానీ చివర్లో దూకుడు పెంచిన శ్రీకాంతో 21 రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ మరో మ్యాచ్‌లో మాజీ ప్రపంచ రెండో ర్యాంకర్‌, డెన్మార్క్‌ స్టార్‌ జాన్‌ ఒ జార్జెజన్‌సన్‌పై హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (భారత్‌) సంచలన విజయం సాధించాడు. ఇక్కడ జరిగిన ప్రీ క్వార్టర్‌ మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21 20 21 తేడాతో విజయం సాధించి దాదాపు 8 నెలల తర్వాత క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ ఇతర మ్యాచుల్లో హైదరాబాదీ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ 21 21 సీన్సంబన్సక్‌ (థాయ్‌లాండ్‌)ను, బి. సాయి ప్రణీత్‌ 18 21 21 భారత్‌కే చెందిన ఐదో సీడ్‌ సమీర్‌ వర్మను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. ఇక మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌, ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ పివి సింధు 21 21 తేడాతో హాంగ్‌ కాంగ్‌కు చెందిన జోయ్‌ జువాన్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసి సెమీస్‌లో ప్రవేశించింది.

DO YOU LIKE THIS ARTICLE?