కొవిడ్‌ ఆంక్షలు కాంగ్రెస్‌ నేతలకేనా?

వారు ఐపిఎస్‌లు కారు… కెపిఎస్‌లు

విరుచుకుపడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు, మంత్రులకు లేని కోవిడ్‌ ఆంక్షలు కాంగ్రెస్‌ నేతలకే ఉంటాయా? అని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్‌కు కొంత మంది పోలీసు లు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారు ఐపిఎస్‌లుగా కాకుండా కెపిఎస్‌లుగా మారారని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి జలదీక్షకు వెళ్లకుండా పోలీసులు అ డ్డుకున్న నేపథ్యలో శనివారం కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, నేత షబ్బీర్‌ అలీతో కలిసి తన నివాసం వద్దనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రజలకు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు.ప్రాజెక్టుల విషయంలో కూడా ఇవే అబద్ధాలు చెబుతున్నారని, అందుకే కెసిఆర్‌ ఏమి అభివృద్ధి చేస్తున్నాడో ప్రజలకు వివరించాలనే తాము ప్రాజెక్ట్‌ లను సందర్శించాలనుకున్నామన్నారు. కృష్ణా ప్రాజెక్టుల సందర్శనకు జూన్‌ 2న బయలు దేరుతుంటే అరెస్టు చేశారని, ఇప్పుడు గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్ళాలనుకు న్నా అదే పరిస్థితి ఎదురైందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టి, కోసం ప్రాజెక్ట్‌లను రీడిజైన్‌ చేశారన్నారు. సిఎం కెసిఆర్‌ రాష్ట్రా న్ని దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తొక్కేయాలని అనుకుంటున్నారని, తెలంగాణలో ప్రజాస్వా మ్యం ఈ విధంగా ఉంటుందని అనుకోలేదన్నారు. చాలా మంది పోలీస్‌లు అధికారులు చిత్త శుద్ధితో పని చేస్తున్నారని, కాని కొంత మంది అధికారులు కెసిఆర్‌ కు తొత్తుగా మారారని ఉత్తమ్‌ విరుచుకుపడ్డారు.కెటిఆర్‌ మీటింగ్‌ లు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ నేతలపై విమర్శలు చేస్తారని, కాని తమకు మీటింగ్‌ పెట్టుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వడం లేదన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ప్రతి రోజు వందల మందితో మీటింగ్‌లు పెడతాడని, నా పార్లమెంట్‌ నియోజకవర్గం నల్లగొండలోని ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్ట్‌ పనులు పరిశీలనకు వెళ్లకుండా పోలీస్‌లు తనను అడ్డుకున్నారని ఉత్తమ్‌ అన్నారు.
డిజిపి మా తప్పేంటి?
మంజీరా డ్యాంను పరిశీలించేందుకు వెళ్తుంటే అరెస్ట్‌ చేసి కేసులు పెట్టారని, కరెంటు బిల్లులుపై మంత్రులను , అధికారులను కలవాలనుకున్నా అరెస్టు చేశారని, ఇందులో తప్పేముంది డిజిపి? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించా రు. ప్రాజెక్ట్‌ల సందర్శిస్తున్నామని డిజిపికి లేఖ రాసిన స మాధానం లేదన్నారు. కరోన వ్యాప్తి నివారణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేశారని రాష్ర్ట పోలీస్‌లు చెబుతున్నారని, అది కేవలం కాంగ్రెస్‌ పార్టీకే వర్తిస్తుందా? టిఆర్‌ఎస్‌ నేతలకు వర్తించదా అని ప్రశ్నించారు. డిజిపి మహేందర్‌రెడ్డి నోరు మెదపడం లేద ని, ఫోన్‌ ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చే యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అణిచివేయలని చూ స్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదేమి జాగీర్‌ కాద ని, ఏ పొరటనికైనా సిద్ధమేనన్నారు. కెసిఆర్‌, డిజిపి, హైదరాబాద్‌ కమిషనర్‌ లు నాటకం ఆడుతున్నారని,కాంగ్రెస్‌ నేతల పట్ల పోలీస్‌లు వ్యవరిస్తున్న తీరుపై గవర్నర్‌ను, కేంద్ర పెద్దలను కలుస్తామన్నారు.పోలీస్‌ల తీరుపై న్యాయ పోరాటం కూడా చేయబోతున్నామని చెప్పారు. కొండా పోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం అయినా నెల అయిందో లేదో కాలువకు గండి పడిందని, పనులు ఎంత నాణ్యత తో ఈ ప్రాజెక్టు ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఉత్తమ్‌ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?