కొండలు మింగేస్తున్నారు!

ప్రకృతి సంపదపై గొడ్డలివేటు
అక్రమ పేలుళ్లతో ప్రాణాలు కోల్పోతున్న కష్టజీవులు
కోట్లాది రూపాయల గ్రామీణ సంపదను కొల్లగొడుతున్న రాబందులు

ప్రజాపక్షం/ హుజూరాబాద్‌ : కళ్ల ముందే ప్రకృతి సంపద సర్వనాశనమవుతోంది. ఆకాశాన్ని చుంబిస్తున్నట్లుగా మబ్బులను తాకుతూ అనాదిగా గ్రామీణులు జీవితాలకు ఆలంబనగా నిలుస్తూ వస్తున్న వందలాది కొండ కోనలు చూస్తుండగానే నేలమట్టమవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు, గ్రామీణ జనం గొంతెత్తి నిరసన గళం వినిపిస్తున్నా, పత్రికల్లో జరగబోయే విపత్తుల గురించి పదేపదే ఘోషిస్తున్నా ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో, ఉన్నతాధికారుల, రాజకీయ నేతల అండదండలతో డివిజన్‌లోనే కాకుండా కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఏళ్లుకు ఏళ్లుగా కొండలు గుట్టలు గ్రానైట్‌ రక్కసికి బలై పోతున్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు వా పోతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ప్రస్తుతం బంగారు తెలంగాణ కోసం వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రకటించుకుంటున్న పాలకులు కనుమరుగైపోతున్న శిఖరాల విషయంలో వినిపిస్తున్న లక్షలాది నిరసనల గురించి స్పందించకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
కళ్ల ముందే కనుమరుగవుతున్న కొండకోనలు…
తెలంగాణ జిల్లాలోని గ్రానైట్‌కు స్వర్గధామంలా పిలవబడుతున్న జిల్లా నుంచి వేల కోట్ల రూపాయ ల విలువ చేసే అత్యత విలువైన వివిధ రంగుల గ్రానైట్‌ సంపద ప్రతిరోజు సముద్ర మార్గాన ప్రపంచంలోని అనేక దేశాలకు తరలిస్తున్నారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి ప్రజల దృష్టిలో ఈ వ్యా పారం ఓ బోగస్‌ దందాగా పిలువబడుతోంది. ఒక గ్రామంలో ఉన్న గుట్టను ఎవరు లీజుకు తీసుకున్నారు, ఈ గుట్ట ద్వారా ఎన్ని కోట్ల రూపాయల గ్రానైట్‌ తరలించబడుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?