కేసులు మళ్లీ పెరిగాయ్‌!

కొత్తగా 21 కరోనా పాజిటివ్‌లు
రాష్ట్రంలో 1082కి పెరిగిన కొవిడ్‌-19 కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఆదివారంనాడు ఒక్కరోజే 21 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఒక అంకెకు (సింగిల్‌ డిజిట్‌) పరిమితమైన కేసులు తాజాగా రెం డంకెల సంఖ్య (డబుల్‌ డిజిట్‌)కు చేరింది. ఈ కేసుల్లో 20 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనే నమోదు కావడం విశేషం. మరో కేసు జగిత్యాలలో నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1082కి చేరాయి. ఆదివారంనాడు 46 మంది డిశ్చార్జి కాగా, మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 545కి చేరింది. ఇప్పటివరకు 29 మంది మరణించారు. ఇంకా 508 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలుగా వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తిలు నిలిచాయి. అలాగే గడిచిన 14 రోజులుగా అంటే రెండు వారాలుగా 17 జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఆ జిల్లాల్లో కరీంనగర్‌, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, బద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, నల్గొండ, నారాయణపేట జిల్లాలు వున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?