కేరళ సిఎంతో కెసిఆర్‌ భేటీ

అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
విజయన్‌ ఇంట్లో విందు
హైదరాబాద్‌ : కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం త్రివేండ్రం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆరు రోజుల పాటు ఆయన ఆ రాష్ట్రాలు పర్యటించి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ మేర కు సోమవారం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం కేరళ బయలుదేరి వెళ్లిన కెసిఆర్‌.. సోమవారం సాయంత్రం త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ త ర్వాత పినరయి విజయన్‌తో సమావేశమయ్యా రు. కెసిఆర్‌ గౌరవార్థం కేరళ సిఎం ఆ రాత్రికి అక్కడే విందు ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో సిఎం కెసిఆర్‌ కోవలంలోనే విశ్రాం తి తీసుకోనున్నారు. 8న కన్యాకుమారికి వెళ్లి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి 9న రామేశ్వరం వెళ్తారు. 10న మధుర మీనాక్షి ఆలయం, 11న శ్రీరంగంలో పూజాధికాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి చెన్నైకు చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

DO YOU LIKE THIS ARTICLE?