కుప్పకూలిన విమానం

అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తుండగా ఘటన
కొలంబియా విమాన ప్రమాదంలో 12 మంది మృతి

అడీస్‌ అబాబా ఇథియోపియాలో విషా ద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం దేశ రాజధాని నుంచి టేకాఫ్‌ నిమిషాల వ్యవధిలోనే ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కుప్పకూలింది. ఈ ఘటన లో విమానంలో 157 మంది దుర్మరణం చెందినట్లు ఎయిర్‌లైన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే బోయింగ్‌ 737- మ్యాక్స్‌ విమానం కూలిపోవడానికి కా ర ణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. కాగా, కొత్తగా రూపొందించిన ఈ విమా నం గత నవంబర్‌లో ఎయిర్‌లైన్‌కు డెలివరీ అయింది. ప్రభుత్వం నేతృత్వంలో కా ర్యకలాపాలను నిర్వహిస్తును ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు ఆఫ్రికాలో మంచి పేరుంది. ఇదిలా ఉండగా 149 ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో బోయింగ్‌ 737- మ్యాక్స్‌ వి మానం ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి కె న్యా రాజధాని నైరోబికి వెళ్లేందుకు టేకాఫ్‌ కాగా, ఆరు నిమిషా ల తరువాత ఈ విమానం కుప్పకూలినట్లు ఎయిర్‌లైన్‌ ఒక ప్ర కటనలో తెలియజేసింది. ఉదయం 8.44 గంటలకు అడీస్‌ అ బాబాకు దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయని ఎయిర్‌లైన్‌ పేర్కొంది. ప్రయాణికులకు అందరూ మృతి చెందారని, విమానంలో 33 దేశాల కు చెందిన వారు ఉన్నారని దేశ అధికారిక వార్తా సంస్థ ఇబిసి వెల్లడించింది. మృతుల పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ స భ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు హురు కెన్యట్ట పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్‌ మరో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ వి మానం ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి అయి న నిమిషాల్లోనే జావా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 189 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, చి వరిసారిగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 2010లో కూలిపోయింది. బీరూట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల తర్వాత వి మానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 90 మంది మృత్యువాత పడ్డారు.
మృతుల్లో భారతీయులు, అమెరికన్లు, చైనీయులు
విమానం ప్రమాదంలో మృతి చెందిన వారిలో భారతీయులు, కెనాడియన్లు, చైనీయులు, అమెరికన్లు ఉన్నట్లు ఇథియోపియ న్‌ ఎయిర్‌లైన్స్‌ సిఇఒ, కెన్యా రవాణా మంత్రి చెప్పారు. వీరే కా కుండా బాధితుల్లో వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఉ న్నారన్నారు. అయితే అంతకు ముందు ఆయన మృతి చెందిన వారిలో 32 మంది కెన్యాకు చెందిన వారు, 17 ఇథియోపియ న్లు ఉన్నారని తెలియజేశారు. ఆ తరువాత 18 మంది కెనాడియన్లు, చైనా, యుఎస్‌, ఇటిలీకు చెందిన వారు 8 మంది చొప్పున, ఫ్రాన్స్‌, బ్రిటయిన్‌కు చెందిన వారు ఏడుగురేసి చొప్పున, ఆరుగురు ఈజిప్టుకు చెందిన వారు, ఐదుగురు నెదర్లాండ్స్‌కు చెందిన వారు, భారత్‌, స్లోవాకియాకు చెందిన వారు నలుగురేసి చొప్పున ఉన్నట్లు ఆయన ప్రకటించారు. బాధితులు వివరాలను వారి బంధువులు, మిత్రులు తెలుసుకునేందుకు అత్యవసర స్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?